China’s Real Estate Crisis: చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం కొనసాగుతోంది. గత రెండేళ్లుగా అక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ నేల చూపులు చూస్తోంది. దీని ప్రభావంతో చైనా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. డిమాండ్ లేకపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వినియోగదారులను ఆకర్షించడానికి వింత వింత ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. టియంజాన్‌లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టిన ఆఫర్ చూస్తే మీరు నోరెళ్లబెడతారు. తమ దగ్గర ఇల్లు కొంటే భార్య ఫ్రీ అని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ ప్రకటన చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. సదరు సంస్థపై రూ. 3 లక్షలు జరిమానా విధించారు చైనా అధికారులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌లోని ఓ కంపెనీ ఇల్లు కొంటే ఏకంగా బంగారు కడ్డీలను ఉచితంగా ఇస్తామని ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేసింది. రెండు సంవత్సరాల క్రితం రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్‌గ్రాండే  దివాళా తీయడంతో ఆ దేశంలో రియల్ ఎస్టేట్ కష్టాలు మెుదలయ్యాయి. ఆ తర్వాత చాలా మల్టీ బిలియన్ డాలర్ల కంపెనీలు కూడా కుప్పకూలాయి. దీంతో చైనాలో ఇళ్ల రేట్లు భారీగా పడిపోయాయి. చైనాలోని నాలుగు సంపన్న నగరాల్లో ప్రస్తుతం ఉన్న ఇళ్ల ధరలు 11% మరియు 14% మధ్య తగ్గాయి.  కొత్త ఇళ్ల విక్రయాలు 6 శాతానికి పడిపోయాయి. ఇదే పరిస్థితి మరో రెండేళ్లపాటు కొనసాగుతోందని పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనాలో స్టాటిస్టిక్స్ డిపార్ట్‌మెంట్ మాజీ హెడ్ షెంగ్ సాంగ్‌చెంగ్ తెలిపారు. రియల్ ఎస్టేట్ సంక్షోభంతో పాటు అధిక యువత నిరుద్యోగం మరియు అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా చైనా వృద్ధి రేటు మందగించింది. 


Also Read: PNB FD Rates: పంజాబ్ నేషనల్ బ్యాంక్ గుడ్‌న్యూస్, ఎఫ్‌డీపై అత్యధికంగా 8 శాతం వడ్డీ


Also Read: UPI New Changes 2024: యూపీఐలో మార్పులు, రోజుకు లిమిట్, పేమెంట్ ఛార్జీలు ఇలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook