Redmi Note 13 Pro+5G: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రెడ్‌మి ఎప్పటికప్పుడు కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేస్తూ మార్కెట్ వాటా పెంచుకుంటోంది. ఆకర్షణీయమైన ఫీచర్లు, సూపర్ పవర్‌ఫుల్ కెమేరా ఉండటంతో అందరూ రెడ్‌మి ఫోన్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది.
ఒక్క కెమేరా చూస్తే చాలు..వెంటనే కొనేందుకు సిద్దమైపోతారు. 200 మెగాపిక్సెల్ కెమేరాతో రెడ్‌మి కంపెనీ Redmi Note 13 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ మరో ప్రత్యేకత ఏంటంటే కేవలం 19 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. అత్యాధునిక ఫీచర్లు, టెక్నాలజీతో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్లు లాంచ్ చేయడం రెడ్‌మి ప్రత్యేకత. ఈసారి 200 మెగాపిక్సెల్ కెమేరా, 19 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌నే షేక్ చేసేందుకు సిద్ధమైంది. డిజైన్, లుక్ కూడా చాలా బాగుంటుంది.
Redmi Note 13 Pro+ 5G ఫీచర్లు
ఈ ఫోన్‌లో ఫీచర్లు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. Redmi Note 13 Pro+ 5G పనితీరు అద్భుతంగా ఉండేందుకు ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ప్రోసెసర్ వినియోగించారు. ఇక బ్యాటరీ కూడా పవర్ ఫుల్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. కానీ ఇందులో ప్రత్యేకత ఏంటంటే 120 వాట్స్ ఛార్జర్ సపోర్ట్ చేయడంతో కేవలం 19 నిమిషాల్లో మొత్తం ఛార్జ్ అయిపోతుంది.
పవర్‌ఫుల్ కెమేరా
Redmi Note 13 Pro+ 5G కెమేరా క్వాలిటీ ముందు మరే ఇతర స్మార్ట్‌ఫోన్ పనికి రాదు. ఏకంగా 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా ఉంటుంది. దాంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సాల్ లెన్స్ , 2 మెగాపిక్సెల్ స్పోర్టెడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉపయోగించారు.
Redmi Note 13 Pro+ 5G ధర
రెడ్‌మి కంపెనీ రెడ్‌మి నోట్ 13 ప్రో ప్లస్ లాంచ్ చేసింది కానీ మార్కెట్‌లో ఇంకా విడుదల కాకపోవడంతో ధర ఎంతనేది ఇంకా తెలియలేదు. ఇందులో 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఉంటుంది. ఈ వెర్షన్ ధర దాదాపుగా 30 వేలుండవచ్చని తెలుస్తోంది.
Also read: GPS Toll System: త్వరలో జీపీఎస్ టోల్ విధానం, ఎలా పనిచేస్తుంది, ఎప్పట్నించి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook