11 Year Old Boy Dies In Bomb Blast: పశ్చిమబెంగాల్‌లో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. టాయిలెట్‌లో బాంబు పేలి 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బంగావ్‌లోని బక్సిపల్లి  ప్రాంతంలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా.. బక్సిపల్లి సమీపంలో నివాసం ఉండే రాజు రాయ్ (11) అనే బాలుడు సైకిల్ గ్యారేజ్‌లో పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం పబ్లిక్ టాయిలెట్‌లోకి వెళుతుండగా.. ఆకస్మాత్తుగా పేలుడు సంభవించింది. పేలుడు తాకిడికి బాలుడు అక్కడికక్కడికే మరణించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారీ శబ్దం రావడంతో బాలుడి తండ్రి ప్రశాంత్ రాయ్‌తో పాటు స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న కొడుకుని చూసి కన్నీరుమున్నీరయ్యాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. యాంటీ బాంబ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుని.. ఆ టాయిలెట్స్‌లో మరో 8 గ్రనేడ్లను నిర్వీర్యం చేశారు.  పబ్లిక్ టాయిలెట్‌లో బాంబులు భద్రపరిచారని.. అవి పేలడంతో ప్రమాదం సంభవించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో బప్పా బిస్వాస్, అసిత్ అధికారి అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు వెనుక మరెవరైనా ఉన్నారా లేదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


ఈ ఘటనపై బంగావ్ నార్త్ బీజేపీ ఎమ్మెల్యే అశోక్ కీర్తన్య మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ మొత్తం గన్‌పౌడర్‌ విచ్చలవిడిగా ఉందన్నారు. గతంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో బంగావ్‌లోని అన్ని బూత్‌లలో బాంబులు భద్రపరచడం గురించి మనం విన్నామన్నామరు. ఇప్పుడు బాంబులు పేలడం రొటీన్ వ్యవహారంగా మారిందని ప్రభుత్వంపై విమర్శించారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ సుకాంత మంజుందార్ మాట్లాడుతూ.. టీఎంసీ, మమతా బెనర్జీల అభివృద్ధి పనులు మరుగుదొడ్లకు కూడా చేరాయంటూ ఫైర్ అయ్యారు. బాలుడి మరణానికి సీఎం మమతా బెనర్జీ బాధ్యత వహిస్తారా..? అని ప్రశ్నించారు.


Also Read: CM YS Jagan Mohan Reddy: పోలవరం పనులను పరిశీలించిన సీఎం జగన్.. డయాఫ్రం వాల్‌ను పూర్తిచేయాలని ఆదేశం  


మరోవైపు ఈ ఘటనకు బీజేపీయే కారణమని టీఎంసీ నేతలు ఆరోపించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని పోలీసులను కోరారు. బంగాన్ మున్సిపాలిటీ చైర్మన్ గోపాల్ సేథ్ మాట్లాడుతూ.. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తును కోరుతున్నామన్నారు. ఈ కుట్ర వెనుక బీజేపీ ఉందని అన్నారు. అభిషేక్ బెనర్జీకి పెరుగుతున్న పాపులారిటీ చూసి వారు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. టాయిలెట్స్‌లో ఆరు బాంబులు పేలినట్లు ఆయన తెలిపారు.


Also Read: UPI Cash Withdrawal: ఏటీఎంలో యూపీఐ ద్వారా క్యాష్ విత్ డ్రా చేసుకోండి..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook