Thunderbolt: అమ్మమ్మ ఇంట్లో విషాదం.. క్రికెట్ ఆడుతున్న యువకుడిని బలిగొన్న పిడుగు
Tragedy Incident Lighting Young Boy Died In Nalgonda District: సరదాగా వేసవి సెలవులను గడపడానికి అమ్మమ్మ ఊరికి వచ్చిన యువకుడు పిడుగుపాటుకు బలవడం తీవ్ర విషాదం నింపింది. క్రికెట్ ఆడుతూ చెట్టు కిందకు చేరడమే అతడి మృత్యువుకు కారణం.
Tragedy Incident: వేసవికాలం అకాల వర్షం చాలా ప్రమాదకరం. ఈదురుగాలులు, ఉరుములుమెరుపులు చాలా ప్రమాదాలకు దారి తీస్తాయి. ఈ సమయంలో ఇంట్లోనే ఉంటేనే క్షేమం. ఆరు బయట తిరిగితే చాలా ప్రమాదకరం. ఉరుములు మెరుపుల సమయంలో ఆరు బయట ఉన్న ఓ యువకుడు పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. వేసవి సెలవుల కోసం అమ్మమ్మ ఇంటికి రాగా పిడుగురూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
Also Read: Betting Murder: బెట్టింగ్ ఖరీదు ఒక ప్రాణం.. రూ.2 కోట్లు.. ఆస్తిపాస్తులు అమ్మేసిన కొడుకు హత్య
నల్గొండ జిల్లా వెలుగుపల్లి గ్రామానికి చెందిన మర్రి రుషి (20) వేసవి సెలవుల నేపథ్యంలో అమ్మమ్మ ఊరికి వెళ్లాడు. త్రిపురారం మండలం నిలయాగూడెంలోని అమ్మమ్మ నివాసానికి చేరుకుని సరదాగా ఉంటున్నాడు. నిత్యం ఆటలు ఆడుతూ సెలవులను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మంగళవారం గ్రామంలోని యువకులతో కలిసి రిషి వ్యవసాయ పొలాల్లో క్రికెట్ ఆడుతున్నాడు. మధ్యాహ్నం యువకులంతా కలిసి ఆడుకుంటున్న సమయంలో కొద్దిపాటి జల్లులు కురిశాయి.
Also Read: Mothers Day: మదర్స్ డే రోజే తీరని విషాదం.. 'అమ్మా' అంటూ తల్లీని కాపాడబోయి కొడుకు మృతి
వర్షం రావడంతో యువకులంతా కలిసి చెట్ల కిందకు వెళ్లారు. అయితే ఉరుములు మెరుపులు కూడా వచ్చాయి. ఈ సమయంలో ఒక్కసారి యువకులు నిల్చున్న చెట్టుపై పిడుగు పడింది. పిడుగుపాటుకు మర్రి రుషి (20) అక్కడిక్కడే మృతి చెందాడు. గ్రామానికి చెందిన మరో ఇద్దరు చాగంటి సిద్దు (17) దైవం ప్రదీప్ (17) కుప్పకూలిపోయారు. అయితే వారు ప్రాణాలతో బయటపడడం విశేషం. గాయాలవడంతో వారిద్దరినీ మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ చికిత్స పొందుతున్నారు.
రెండు గ్రామాల్లో విషాదం
పిడుగుపాటు రెండు గ్రామాల్లో తీవ్ర విషాదం నింపింది. వేసవి సెలవులకు అమ్మమ్మ ఊరైన నీలయగూడెం రాగా పిడుగుపాటుతో మృతిచెందడంతో రిషి అమ్మమ్మ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. ఇక ఈ సమాచారం తెలుసుకున్న రిషి స్వగ్రామం వెలుగుపల్లిలోనూ విషాదం ఏర్పడింది. రిషి కుటుంబసభ్యులు వెంటనే నీలయగూడెం గ్రామానికి చేరుకున్నారు. ఈ వార్త స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. వర్షాలు కురిసే సమయంలో, ఉరుములు మెరుపుల సమయంలో ఎవరూ బయటకు వెళ్లవద్దని ఈ సందర్భంగా పోలీసులు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter