22 Year old woman raped by Rapido Driver and his friend in Bengaluru: ఇప్పుడు ఓలా, ఉబెర్, ర్యాపిడో లాంటి సంస్థలు బైక్ టాక్సీ సర్వీసులు కూడా అందచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే బెంగళూరులోని ఒక యువతిపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. బెంగళూరు నగరంలో కేరళకు చెందిన ఒక యువతిపై ఓ ర్యాపిడో డ్రైవర్ తన స్నేహితుడితో కలిసి ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిజానికి, ఆ యువతి ఒక స్నేహితుడి ఇంటి నుండి మరొక ఇంటికి వెళ్ళడానికి రాపిడో బుక్ చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాపిడో డ్రైవర్ ఆమెను పికప్ లొకేషన్ నుండి ఎక్కించుకున్నాడు. అయితే ఆ సమయంలో యువతి మద్యం మత్తులో ఉండడంతో పెద్దగా స్పృహలో లేదు. ఆమె మద్యం మత్తులో ఉందన్న విషయం అర్ధం ర్యాపిడో డ్రైవర్ యువతిని తన నివాసానికి తీసుకెళ్లాడు. అక్కడికి అతని మరో స్నేహితుడు కూడా వచ్చి కలిసి యువతిపై అత్యాచారం చేశారు. ఈ అంశం మీద యువతి కేసు పెట్టడంతో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన నవంబర్ 25 రాత్రి బెంగళూరు నగరంలో ఎలక్ట్రానిక్ సిటీలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.


22 ఏళ్ల కేరళ యువతి రాపిడో బుక్ చేసుకున్న తర్వాత ఒక స్నేహితుడి ఇంటి నుండి మరొక ఇంటికి వెళుతోంది. యువతికి  పూర్తిగా స్పృహ లేని క్రమంలో దాన్ని అవకాశంగా తీసుకున్న ర్యాపిడో డ్రైవర్ ఆమెను ఎలక్ట్రానిక్ సిటీలోని తన ఇంటికి తీసుకెళ్లి తన స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక నిందితులకు మరో మహిళ సహకరించినట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఆమె యువతి స్నేహితురాలికి ఫోన్ చేసి, మద్యం మత్తులో తనను కలిసిందని, అందుకే ఆమెకు ఆశ్రయం కల్పించేందుకు ఇక్కడికి తీసుకొచ్చానని అబద్దం చెప్పింది.


ఈ క్రమంలో రేప్ గురించి నిందితురాలు యువతి స్నేహితురాలితో ఏమీ చెప్పలేదు. మరుసటి రోజు బాధితురాలు నొప్పితో ఏడవడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్లగా, ఆమె మీద అత్యాచారం జరిగినట్లు తెలుసుకుంది. అనంతరం బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులు నిందితుడు ర్యాపిడో డ్రైవర్ లొకేషన్ ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు. ఇక ఇది చాలా తీవ్రమైన విషయం కాబట్టి, ఫోరెన్సిక్ బృందాన్ని విచారణ కోసం రంగంలోకి దించామని, ఆధారాలు సేకరించేందుకు ఘటనా స్థలంలో విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.


ఈ విషయాన్ని డీసీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.  ఇక అదే సమయంలో విచారణను త్వరగా పూర్తి చేసి దోషులను శిక్షిస్తామని పోలీసు కమిషనర్ హామీ ఇచ్చారు. నిందితుల్లో ఒకరిపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. నిందితుల్లో ఒకరు ర్యాపిడో డ్రైవర్ కాగా, మరొకరు మొబైల్ ఫోన్ స్టోర్‌లో పనిచేస్తున్నారని వెల్లడించారు. నిందితులకు సహాయం చేసిన మహిళ వారి స్నేహితురాలని, వారు బాధితురాలిని ఎలక్ట్రానిక్ సిటీలోని నిందితుల్లో ఒకరికి చెందిన గదికి తీసుకెళ్లారని గుర్తించారు.


ఆ యువతి తన గదికి ఎప్పుడు వచ్చిందో బాధితురాలికి తెలియదు కానీ మరుసటి రోజు బాధితురాలి స్నేహితులు అక్కడికి చేరుకోగా బాధితురాలిని తాను తాగిన స్థితిలో గుర్తించానని, అందుకే ఆమెను తన రూమ్ కు తీసుకువచ్చానని చెప్పింది. ఇక అత్యాచారం జరిగిన సమయంలో నిందితులకు సహాయం చేస్తున్న మహిళ కూడా అక్కడే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక సదరు యువతి వయస్సు 22 సంవత్సరాలు కాగా ఇద్దరు నిందితులు కూడా 22 మరియు 23 సంవత్సరాల వయస్సు గలవారని తేలింది. 


Also Read: 'శ్రద్ధ'ను పోలిన మర్డర్ కేసు నిందితులను పట్టించిన మొబైల్ ఫోన్.. ఇంత ఈజీగా దొరికేశారా


Also Read: శ్రద్ధ'పై అనుమానమే ఇంతదాకా తెచ్చిందా..వేరే వాళ్లతో వెళుతుందనే ఇలా.. కొత్త కోణం?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook