Nellore Train Accident: నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. రైల్వే బ్రిడ్జిపై రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో ముగ్గురు  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల వివరాలతో పాటు  ఈ ఘటనపై  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. మృతులు ఏ ప్రాంతానికి చెందిన వారే విషయంపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందా..? లేక ముగ్గురు ఆత్మహత్య చేసుకునేందుకు పట్టాలపైకి వెళ్లారా..? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రత్యక్ష సాక్షులను విచారించి.. మృతుల ఆచూకీ కనిపెట్టే పనిలో ఉన్నారు. 


శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. గూడూరు వైపు నుంచి విజయవాడ వైపు వెళుతున్న నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ వీరిని ఢీకొన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు పురుషులు రైలు పట్టాలపైనే ప్రాణాలు కోల్పోయారు. మహిళ మృతదేహం పట్టాలపై నుంచి కిందపడిపోయింది. మృతుల వయస్సు 40 నుంచి 50 ఏళ్లు ఉంటాయని రైల్వే పోలీసులు అంచనా వేశారు. 


మృతులకు సంబంధించిన సంచులను ప్రమాద స్థలంలో రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల ఆధార్ కార్డులు, టీటీడీ లాకర్ అలాట్‌మెంట్ టికెట్లు లభించాయి. ఆధార్ కార్డుల ఆధారంగా మృతులు విజయవాడకు చెందిన వారిగా తెలుస్తోంది. అయితే గుర్తింపుకార్డులో తెన్నేటి సరస్వతీరావు అనే పేరు ఉండగా.. టీటీడీ లాకర్ అలాట్‌మెంట్ టికెట్‌లో మాత్రం రమేష్ నాయక్ అనే పేరు ఉన్నట్లు సమాచారం. మహిళకు సంబంధించి ఎలాంటి వివరాలు లభించలేదు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని రైల్వే పోలీసులు తెలిపారు. 


Also Read: Rohit Sharma: గ్రౌండ్‌లోకి దూసుకువచ్చిన బాలుడు.. రోహిత్ శర్మ చెప్పిన ఆ ఒక్క మాటతో..  


Also Read: Visakhapatnam Girl: ప్రియుడి మోజులో బాలిక.. కన్నతండ్రినే చంపేందుకు యత్నం


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook