Massive Incident: ఆంధ్రప్రదేశ్‌లో అనాథ పిల్లల విషాద వార్త నుంచి కోలుకోకముందే మరో ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఓ పరిశ్రమలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఏడుగురి ప్రాణాలు గాల్లో కలిశాయి. పదుల సంఖ్యలో గాయపడిన కార్మికులు ఆస్పత్రిలో కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ విషాద సంఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కాగా ప్రమాదంపై సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, మంత్రులు వంగలపూడి అనిత, నారా లోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Bengaluru Ambulance: ఫ్లైఓవర్‌పై అంబులెన్స్‌ బీభత్సం.. అచ్చం సినిమాలో చూసినట్టే దృశ్యాలు


అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఎస్ఎన్సియా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మంటలు.. పొగకు పరిశ్రమలో పని చేసే ఉద్యోగులు, కార్మికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో సుమారు 50 మంది వరకు కార్మికులకు గాయాలయ్యాయి. మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడిన వారుమృత్యువాత పడ్డారు. కాగా ప్రమాదం ధాటికి ఒక అంతస్తు శ్లాబ్‌ కూలిపోయింది. దీంతో ఆ శిథిలాల కింద కొందరు చిక్కుకున్నట్లు సమాచారం.

Also Read: Scissor Missing: ఒక కత్తెరతో 36 విమానాలు రద్దు, 201 ఆలస్యం.. తీరా చూస్తే నవ్వుకోవడమే!


సమాచారం అందుకున్న వెంటనే పోలీస్‌, అగ్నిమాప సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రితోపాటు స్థానిక ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రమాదం జరగడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. లేకపోతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉండేది. కాగా ప్రమాదంతో గ్రామాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు.


హోంమంత్రి ఆరా
ఎసెన్సియా కెమికల్ ఫ్యాక్టరి ప్రమాదంపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. 


ప్రమాదం ఇలా..
ఎస్సేనియా కంపెనీలో మధ్యాహ్నం ఉద్యోగులు, సిబ్బంది భోజనానికి వెళ్లారు. సుమారు 2:30 సమయంలో రెండో అంతస్తులో రియాక్టర్ పేలింది. వెంటనే మంటలు, దట్టమైన పొగ వ్యాపించింది. విధుల్లో ఉన్న సిబ్బంది, కార్మికులు.. భోజనానికి వెళ్లిన ఉద్యోగులు అవస్థలు పడ్డారు. కాగా పరిశ్రమలో దాదాపు 300 మంది పని చేస్తున్నట్లు సమాచారం. ప్రమాదం తీవ్రత అధికంగా ఉంది. కాగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించే అవకాశం ఉంది.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి