Shraddha Walkar Murder Case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో తవ్వనా కొద్ది ఎవ్వరూ నమ్మలేని సంచలనాలు బయటికొస్తున్నాయి. శ్రద్ధా వాకర్ పై అఫ్తాబ్ అమిన్ పూనావాలాకు ప్రేమ లేకపోగా ఆ స్థానంలో ఎంత ద్వేషం పెంచుకున్నాడో అతడు ఆమెను హతమార్చిన తీరే చెబుతోంది. శ్రద్ధా వాకర్ ని హతమార్చి, 35 ముక్కలుగా కత్తిరించి, శ్రద్ధా వాకర్ శవం శరీర భాగాలతోనే 18 రాత్రులు గడిపిన వైనం, శ్రద్ధ వాకర్ శరీర భాగాలు ఇంట్లో ఫ్రిజ్జులో ఉన్న సమయంలోనే అమ్మాయిలను తన రూమ్ కి పిలిపించుకుని వారితో శృంగారం చేయడం వంటి విషయాలన్నీ ఒళ్లు గగుర్పొడిచేవిగా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవన్నీ ఇలా ఉండగా తాజాగా తెలుస్తోన్న వివరాల ప్రకారం శ్రద్ధ వాకర్ ని చంపేసిన రోజు రాత్రంతా అఫ్తాబ్ అమిన్ పూనావాలా ఆమె శవం పక్కనే కూర్చుని గంజాయి సేవించినట్టు తెలుస్తోంది. రాత్రి 9 -10 గంటల మధ్య శ్రద్ధా వాకర్ హత్య జరగ్గా ఆ రాత్రి మొత్తం అఫ్తాబ్ అమిన్ పూనావాల ఏ మాత్రం ప్రాయచిత్తం లేకుండా ఆమె శవంతో గడపడమే కాకుండా.. తనకేమీ పట్టనట్టు గంజాయి నింపిన సిగరెట్లు తాగినట్టు తెలుస్తోంది. తాజాగా తమ విచారణలో అఫ్తాబ్ అమిన్ ఈ నిజాన్ని అంగీకరించినట్టు పోలీసులు చెబుతున్నారు.  


ఢిల్లీ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం శ్రద్ధా వాకర్ హత్యకు గురైన మే 18 నాడు ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇంట్లో రోజువారీ ఖర్చులు మేనేజ్ చేసుకునే విషయంలో శ్రద్ధా వాకర్, అఫ్తాబ్ అమిన్ పూనావాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఆమెకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాని అఫ్తాబ్ ఇంట్లోంచి బయటికెళ్లిపోయి విపరీతంగా గంజాయి సేవించి ఇంటికొచ్చాడు. ఇంటికి రాగానే మరోసారి శ్రద్ధా అతడిపై అరవడంతో ఈసారి శ్రద్ధా వాకర్ పై సహనం కోల్పోయిన అఫ్తాబ్ గంజాయి మైకంలో ఆమెను విచక్షణా రహితంగా కొట్టాడు. తీవ్రంగా హింసించాడు. అఫ్తాబ్ దాడిలో శ్రద్ధా ప్రాణాలు కోల్పోయిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే అఫ్తాబ్ నిజమే చెబుతున్నాడా లేక పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు మరో కట్టు కథ ఏమైనా చెబుతున్నాడా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.


అఫ్తాబ్ శ్రద్ధా వాకర్ హత్యకు ఉపయోగించిన ఆయుధం ఏదీ ఇంతవరకు పోలీసులకు లభించలేదు. అతడి ఇంట్లోంచి స్వాధీనం చేసుకున్న వాటిని ఫోరెన్సిక్ ల్యాబోరేటరికి పంపించారు. ఇదిలావుంటే మరోవైపు అఫ్తాబ్ అమిన్ 5 రోజుల పోలీసుల కష్టడి ముగియడంతో గురువారం నాడు పోలీసులు అఫ్తాబ్ ని వీడియో కాన్ఫరెన్సా ద్వారా కోర్టు ఎదుట హాజరుపర్చగా.. విచారణ నిమిత్తం అతడిని మరో 5 రోజుల పాటు పోలీసు కష్టడీకి ఇస్తున్నట్టు ఢిల్లీ కోర్టు స్పష్టంచేసింది.