Magistrate Suicide: భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే విడాకుల కోసం లాయర్‌ వద్దకు వెళ్తారు. కానీ లాయర్‌కే అలాంటి సమస్య వస్తే? ఏం చేస్తాడు? ఏం చేయలేడు పెళ్లాంతో వేగలేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఇలాంటి సంఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. న్యాయస్థానంలో గుర్తింపు పొందిన న్యాయవాదిగా ఉన్న ఆయన భార్యతో మనస్పర్ధలు వచ్చాయి. అవి చినికి చినికి గాలివానగా మారి అతడు బలన్మరణానికి పాల్పడే స్థాయికి చేరాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Doctor Kicked: డాక్టరా వీధిరౌడీనా.. ఆస్పత్రిలో పేషెంట్‌ను తన్నితరిమిన వైద్యుడు


మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం ముత్తువెల్లి గ్రామానికి చెందిన మణికంఠ (36) హైదరాబాద్‌ నాంపల్లిలోని సిటీ సివిల్‌ కోర్టులో న్యాయవాది. స్పెషల్‌ ఫర్‌ ఎక్సైజ్‌ కేసులు (జేఎఫ్‌సీఎం) సంబంధించి ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌గా మణికంఠ  పని చేస్తుండేవాడు. బార్‌ అసోసియేషన్‌లో సభ్యుడైన మణికంఠ హైదరాబాద్‌ అంబర్‌పేట బతుకమ్మ కుంటలో కుటుంబంతో నివసిస్తుండేవాడు. ఏడు సంవత్సరాల కిందట మహబూబ్‌నగర్‌ జిల్లా భూత్పూర్‌కు చెందిన లలితతో వివాహమైంది. ఐదేళ్ల వరకు వారి కాపురం సాఫీగా సాగింది.

Also Read: Wine Shops: మందుబాబులకు వెరీ బ్యాడ్‌ న్యూస్‌.. వైన్స్‌, బార్లు, పబ్‌లు బంద్‌


రెండేళ్ల కిందట భార్యాభర్యల మధ్య మనస్పర్ధలు, విబేధాలు మొదలయ్యాయి. అవి తీవ్ర రూపం దాల్చడంతో తరచూ గొడవపడేవారు. ఈ గొడవలతో మణికంఠ మనస్తాపం చెందాడు. కొంతకాలం నుంచి ముభావంగా ఉంటున్న మణికంట ఆదివారం ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిసేపటికి గమనించిన కుటుంబసభ్యులు దిగ్భ్రాంతి చెందారు. వెంటనే అతడిని కిందకు దింపి చూడగా అప్పటికే మణికంఠ మృతి చెందాడు. భార్యతో గొడవల కారణంగానే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి