Police Third Degree Torture: ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానంతో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పోలీసుల వైఖరిలో మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. జర్నలిస్టులు, విద్యార్థులు, నిరుద్యోగుతోపాటు సాధారణ ప్రజలపై రెచ్చిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దొంగతనం చేశావని ఒప్పించేందుకు షాద్‌నగర్‌లో దళిత మహిళపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. షాద్‌నగర్‌ పోలీసుల థర్డ్‌ డిగ్రీ ప్రయోగం తీవ్ర దుమారం రేపగా.. అది మరచిపోకముందే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. బోనాల పండుగలో చిన్నపాటి వివాదంలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారిని చిత్రహింసలకు గురిచేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల తీరుపై జడ్జ్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ సంఘటన బహిర్గతమైంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Third Wave Coffee: కాఫీషాప్‌ బాత్రూమ్‌లో కెమెరా.. మహిళల రహాస్య వీడియోలు చిత్రీకరణ


హైదరాబాద్‌లోని పశ్చిమ జోన్‌లో థర్డ్ డిగ్రీ ప్రయోగం చేశారనే వార్త గుప్పుమంది. పోలీసుల తీరుపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ మధురానగర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇటీవల బోనాల ఉత్సవాలు జరిగాయి. ఈ క్రమంలో యూసుఫ్‌గూడలో గంజాయి బ్యాచ్ హల్‌చల్‌ చేసింది. అర్ధరాత్రి ఇంటి ముందు న్యూసెన్స్ చేయడంతో కొందరు వారించారు. ఈక్రమంలో నవీన్ యాదవ్ డ్రైవర్‌తో పాటు వంట మనిషిని పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. వారి పేర్లు శివ, అనిల్‌, నాగేందర్‌గా సమాచారం.


Also Read: Teacher Kiss Video: 'నాకు ముద్దు ఇస్తే నీకు అటెండెన్స్‌'.. ప్రభుత్వ టీచర్‌ ముద్దులాట


అయితే అదుపులోకి తీసుకున్న అనంతరం పోలీసులు వారిపై తీవ్రంగా వేధింపులకు పాల్పడ్డారు. రబ్బర్‌ బెల్టులతో కొట్టారని బాధితులు ఆరోపించారు. నవీన్ యాదవ్ పేరు చెప్పాలని పంజాగుట్ట ఏసీపీ రెండు రోజులపాటు హింసించారని బాధితులు ఆరోపించారు. ఈ క్రమంలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. అదుపులోకి తీసుకున్న మూడో రోజుకు వారిద్దరినీ పోలీసులు కోర్టులో హాజరుపరచడం గమనార్హం. అరెస్ట్ చేసి జడ్జ్ ముందు హాజరుపరచడంతో పోలీసులపై జడ్జ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.


'ఇది అటెంప్ట్ టూ మర్డర్ కేస్ ఎలా వర్తిస్తుంది' అని నాంపల్లి కోర్టు ప్రశ్నించింది. నిందితుల అరెస్ట్‌ను.. రిమాండ్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. ఈ సందర్భంగా పోలీసులకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో మరోసారి పోలీసుల తీరుపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ థర్డ్‌ డిగ్రీ ప్రయోగం కూడా తీవ్ర దుమారం రేపే అవకాశం ఉంది. ఇప్పటికే షాద్‌నగర్‌ సంఘటనతో పోలీస్‌ వ్యవస్థకు చెడ్డపేరు రాగా.. అది జరిగిన కొన్ని రోజులకే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో పోలీసు వ్యవస్థపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌ వ్యక్తమవుతోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter