Third Wave Coffee: కాఫీషాప్‌ బాత్రూమ్‌లో కెమెరా.. మహిళల రహాస్య వీడియోలు చిత్రీకరణ

Woman Customer Finds Hidden Camera In Dust Bin: మహిళలకు కాఫీ షాప్‌ల్లోనూ భద్రత లేదు. కాఫీ తాగడానికి వెళ్లిన కాఫీ షాప్‌లో ఓ యువకుడు బాత్రూమ్‌లో కెమెరా పెట్టి వీడియోలు చిత్రీకరించిన దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Aug 11, 2024, 02:07 PM IST
Third Wave Coffee: కాఫీషాప్‌ బాత్రూమ్‌లో కెమెరా.. మహిళల రహాస్య వీడియోలు చిత్రీకరణ

Hidden Camera In Washroom: సరదాగా కాఫీ తాగేందుకు కాఫీ షాప్‌కు వెళ్తే ఓ మహిళకు విస్తుపోయే సంఘటన ఎదురైంది. వాష్‌రూమ్‌కు వెళ్తే అక్కడ రహాస్యంగా సెల్‌ఫోన్‌ ఉంచిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ మహిళ భయాందోళన చెంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాష్‌రూమ్‌లో మహిళల వ్యక్తిగత వీడియోలు చిత్రీకరించేందుకు ఓ యువకుడు పన్నిన దుర్మార్గం ఇది. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో వెలుగు చూసింది. అయితే ఈ ఉదంతాన్ని మొత్తం ఆ మహిళ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది.

Also Read: Sai Baba Milk Drink: నాగుల పంచమి రోజు అద్భుతం.. పాలు తాగిన షిర్డీ సాయిబాబా

బెంగళూరులోని న్యూ బెల్‌ రోడ్డులో ప్రముఖ థర్డ్‌వేవ్‌ కోఫీ ఇండియా అనే కాఫీ షాప్‌  ఉంది. మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వివరాల ప్రకారం కథనం ఇలా ఉంది. శనివారం ఆగస్టు 10వ తేదీన కాఫీ దుకాణంలోకి ఓ మహిళ వెళ్లారు. అనంతరం వాష్‌రూమ్‌లోకి వెళ్లి వస్తుండగా చెత్తడబ్బాలో (డస్ట్‌బిన్‌)లో అనుమానాస్పదంగా ఓ వస్తువు కనిపించింది. పరిశీలనగా వెళ్లి చూడగా డస్ట్‌బిన్‌లో ఫోన్‌ కనిపించింది. ఆ ఫోన్‌లో వీడియో రికార్డవుతోంది. దాదాపు రెండు గంటల నుంచి రికార్డవుతున్న విషయాన్ని గమనించి ఆమె షాక్‌కు గురయ్యారు.

Also Read: Teacher Kiss Video: 'నాకు ముద్దు ఇస్తే నీకు అటెండెన్స్‌'.. ప్రభుత్వ టీచర్‌ ముద్దులాట

వెంటనే నిర్వాహకులను నిలదీశారు. అనంతరం పోలీసులకు ఫోన్‌ చేశారు. అయితే ఫోన్‌ రికార్డు చేసే క్రమంలో ఎలాంటి ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లు రాకుండా ఫోన్‌ను ఫ్లైట్‌ మోడ్‌లో సెట్‌ చేశారు. అనంతరం కేవలం కెమెరా మాత్రమే రికార్డయ్యేలా అత్యంత జాగ్రత్తగా డస్ట్‌బిన్‌లో పెట్టారు. కాఫీ షాప్‌ సిబ్బందిని మొత్తం విచారించగా అందులో పని చేసే ఓ యువకుడు ఆ కెమెరా పెట్టాడని గుర్తించారు. భద్రావతి ప్రాంతానికి చెందిన ఓ యువకుడిగా గుర్తించి వెంటనే అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

రెండు గంటలపాటు ఫోన్‌ బాత్రూమ్‌లో ఉండడంతో అంతకుముందు వాష్‌రూమ్‌కు వెళ్లిన మహిళలు ఆందోళన చెందుతున్నారు. తమ వీడియో కూడా రికార్డయ్యి ఉంటుందని భయాందోళన చెందుతున్నారు. వెంటనే ఆ వీడియో డిలీట్‌ చేయాలని మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు. అలాంటి నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ప్రముఖ కాఫీ షాప్‌ల్లోనూ ఇలాంటి సంఘటనలు జరిగితే మహిళలకు ఇంకెక్కడ రక్షణ ఉంటుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జరిగిన ఉదంతాన్ని ఓ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకుంది. ' ఇది చాలా అసహ్యకరమైన సంఘటన. చాలా భయంకరంగా ఉంది. ఇక నుంచి ఎక్కడైనా వాష్‌రూమ్‌కు వెళ్తే ముందే అప్రమత్తంగా ఉంటా. ఎంత పెద్ద రెస్టారెంట్‌, కేఫ్‌లు అయినా సరే మిమ్మల్ని మీరు అప్రమత్తంగా ఉండాలని' ఆమె మహిళలకు సూచించారు. ఈ సంఘటనపై సెంట్రల్‌ డీసీపీ స్పందించారు. 'కాఫీ షాప్‌లో పనిచేసే యువకుడిని అరెస్టు చేశాం. పూర్తి వివరాలు తెలుసుకుంటున్నాం' అని చెప్పారు.

ఇక తమ కాఫీ షాప్‌లో జరిగిన ఈ సంఘటనపై థర్డ్‌ వేవ్‌ కాఫీ ఇండియా స్పందించింది. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని పేర్కొంది. “మా వినియోగదారుల భద్రత, క్షేమం మా తొలి ప్రాధాన్యం. సంబంధిత వ్యక్తిని వెంటనే విధుల్లో నుంచి తొలగించాం' అని 'ఎక్స్‌' వేదికగా థర్డ్‌ వేవ్‌ కాఫీ ఇండియా ప్రకటించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x