Apartment Watchman: అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న వారితో చీటీ కడుతున్న వాచ్‌మెన్‌ పరిస్థితులు బాగా లేక చీటీ డబ్బులు చెల్లించడం లేదు. అయితే చీటీ పాడుతున్న దంపతులు దారుణంగా వ్యవహారించారు. వాచ్‌మెన్‌ అని చూడకుండా తరచూ వేధింపులకు పాల్పడుతున్నారు. వారి వేధింపులు శ్రుతిమించడంతో వాచ్‌మెన్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వారి వేధింపులకు తాళలేక ఇంట్లోని కరెంట్‌ ఫ్యూజ్‌ బాక్స్‌ పట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: OU CI Abuse: మళ్లీ రెచ్చిపోయిన సీఐ రాజేందర్‌.. ల** కొ** అంటూ మీడియాపై బూతుపురాణం


హైదరాబాద్‌ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట ప్రగతినగర్‌లో శ్రీ సాయి కృష్ణ  క్లాసిక్ అపార్ట్‌మెంట్‌ ఉంది. ఆ అపార్ట్‌మెంట్‌కు కనకరాజు అనే వ్యక్తి వాచ్‌మెన్‌గా విధులు నిర్వహించేవాడు. అయితే అపార్ట్‌మెంట్‌లోనే నివసిస్తున్న ఉషారాణి దంపతుల చిట్టీల వ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలోనే వాచ్‌మెన్‌ను కూడా చీటీ వేయాలని కోరారు. దీంతో వాచ్‌మెన్‌ తన తాహత్తుకు మించి చీటీ వేయడం ప్రారంభించాడు.

Also Read: Mr Telangana Sohail: రోడ్డు ప్రమాదంలో మిస్టర్‌ తెలంగాణ మృతి.. జిమ్‌ బిల్డర్ల తీవ్ర దిగ్భ్రాంతి


 


కొన్నాళ్లు చీటీ డబ్బులు క్రమం తప్పకుండా చెల్లించాడు. అయితే పరిస్థితులు బాగాలేక చీటీ ఎత్తాడు. తీసుకున్న చిట్టి డబ్బులు వాయిదా ప్రకారం వాచ్‌మెన్‌ కనకరాజు చెల్లించడం లేదు. కొన్ని నెలలుగా కట్టకపోవడంతో కనకరాజును నిచిట్టి వ్యాపారి నిలదీశాడు.  చిట్టి డబ్బుల విషయంలో  ఉషారాణి, ఆమె భర్త తరచూ వేధింపులకు గురి చేస్తుండడంతో కనకరాజు వాటిని తట్టుకోలేకపోయాడు. శుక్రవారం కూడా వారు నిలదీయడంతో మనస్తాపానికి గురయిన వాచ్‌మెన్‌ కనకరాజు వెంటనే ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో ఉన్న కరెంట్ ఫ్యుజ్ బాక్స్ పట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనతో అపార్ట్‌మెంట్‌లో తీవ్ర విషాదం ఏర్పడింది.


మృతుడి కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వాచ్‌మెన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కూకట్‌పల్లి పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అయితే చిట్టీ వ్యాపారం చేస్తున్న ఉషారాణి దంపతులపై కేసు నమోదయినట్లు సమాచారం. కాగా చీట్టీ వ్యాపారం నిర్వహించడం నేరంగా భావిస్తున్నారు. ఎవరూ చీట్టీలు వేయొద్దనే నిబంధనలు ఉన్నాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter