OU CI Rajender Abuse: తెలంగాణలో మీడియాపై పోలీసుల దాదాగిరీ.. దౌర్జన్యం కొనసాగుతోంది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ సీఐ రాజేందర్ రెచ్చిపోతున్నారు. జీ తెలుగు న్యూస్ మీడియా రిపోర్టర్, కెమెరామెన్‌పై రెచ్చిపోయిన ఆయన తాజాగా మరో మీడియా ప్రతినిధిపై వీరంగం సృష్టించారు. అసభ్య పదజాలంతో దూషిస్తూనే 'దుకాణం బంద్ జేయ్' అంటూ హెచ్చరికలు జారీ చేశారు. రెండు రోజులుగా సీఐ రాజేందర్ మీడియాతో దురుసుగా ప్రవర్తిస్తుండడంతో జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరీక్షల వాయిదాపై డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వారి నిరసన, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్ చేయడానికి వెళ్లిన జీ తెలుగు న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్‌తోపాటు కెమెరామెన్‌పై ఓయూ సీఐ రాజేందర్ గల్లా పట్టుకుని లాక్కెళ్లి వాహనంలోకి నెట్టేసిన విషయం తెలిసిందే. ఓయూ పోలీసుల తీరుపై తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. అతడిని సస్పెండ్ చేయాలని రెండు రోజులుగా జర్నలిస్టులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: CI Rajender Rude Behaviour: జీ మీడియాపై సీఐ రాజేందర్ అదే దురుసుతనం.. మీకేం పనీపాటా లేదా అంటూ అక్కసు
జీ తెలుగుపై దాడి జరిగిన ఒక్కరోజు కూడా గడవలేదు అప్పుడే మళ్లీ సీఐ రాజేందర్ రెచ్చిపోయారు. ఆర్ట్స్ కళాశాల వద్ద ఓ మీడియా (జీ తెలుగు కాదు) రిపోర్టర్‌పై సీఐ రాజేందర్ అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. ల***కొ***రా అంటూ రాయలేని విధానంలో ఆయన బూతు పంచాంగం అందుకున్నారు. ఈ వ్యాఖ్యలపై సదరు రిపోర్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఐని నిలదీశారు. ఈ క్రమంలో సీఐ మరింత రెచ్చిపోయి 'దుకాణం బంద్ జేయూ' అంటూ విరుచుకుపడ్డారు. అంతేకాకుండా కాలు మీద కాలు వేసుకుని కుర్చీలో కూర్చున్న సీఐ రాజేందర్ దురుసుగా ప్రవర్తించారు. మీడియాపై దాదాగిరీ ప్రదర్శించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter