Bhilwara Woman Gangrape Case News: " రాజస్థాన్‌లో తాజాగా నమోదైన గ్యాంగ్ రేప్ కేసు స్థానికంగా సంచలనం సృష్టించింది. ఇద్దరు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఓ నిర్మానుష్యమైన ప్రాంతంలో గదిలో బంధించి తనపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారని.. వారిపై ప్రతిఘటించినందుకు తనపై దాడి కూడా చేసి వివస్త్రను చేశారు " అని ఆరోపిస్తూ ఒక మహిళ పోలీసులను ఆశ్రయించింది. మహిళ కిడ్నాప్, గ్యాంగ్ రేప్, ఆపై మహిళను వివస్త్రను చేసి దాడి ఇలా ఎన్నో కోణాలు ఉన్న ఈ కేసు రాజస్థాన్ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చోటుచేసుకున్న ఈ ఘటన రాజస్తాన్‌లో పెను దుమారంరేపింది. మహిళలకు రాష్ట్రంలో రక్షణ కరువైంది అనే ఆరోపణలకు, విమర్శలు తావిచ్చిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులకు తమ దర్యాప్తులో సంచలన విషయాలు తెలిశాయి. గ్యాంగ్ రేప్‌కి గురైనట్టుగా మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. విచారణలో భాగంగా నిందితులు చెబుతున్న విషయం విని నివ్వెరపోవడం పోలీసుల వంతయ్యింది. 25 ఏళ్ల యువతి తన ఇష్ట ప్రకారమే ఇద్దరు పురుషులతో లైంగిక సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. వారిపైనే గ్యాంగ్ రేప్ కేసు పెట్టింది అని పోలీసుల విచారణలో వెల్లడైంది. 


అసలేం జరిగిందంటే..
రాజస్థాన్‌లోని బిల్వాడాలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించిన పోలీసుల కథనం ప్రకారం.. బిల్వాడాకు చెందిన 50 ఏళ్ల దివ్యాంగుడితో ఒడిషాకు చెందిన 19 ఏళ్ల యువతికి ఆరేళ్ల క్రితం పెళ్లయింది. ఆమెకు బిల్వాడాలోనే స్థానికంగా ఉండే ఛోటు సర్గరా, గిర్ధారి అనే ఇద్దరు వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమెతో పడక సుఖం పంచుకోవాలని ఉవ్విళ్లూరిన సర్గరా, గిర్ధారి ఇద్దరూ శుక్రవారం సాయంత్రం ఆమెతో ఓ డీల్ మాట్లాడుకున్నారు. శనివారం రాత్రి తమతో వచ్చి ఏకాంత ప్రదేశంలో తమకు శారీరక సుఖం అందిస్తే అందుకు బదులుగా డబ్బులు ఇస్తామని డీల్ సెటిల్ చేసుకున్నారు. అందుకు ఓకే చెప్పిన ఆ యువతి.. మరునాడు ఆ ఇద్దరు వ్యక్తులు చెప్పినట్టుగానే వారితో కలిసి వెళ్లింది.  


అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే..
ఆ యువతితో సెక్స్ ఎంజాయ్ చేయడానికి పిలిపించుకున్న ఆ ఇద్దరు యువకులు.. ఆమెను ఆ రాత్రంతా అక్కడే తమతో గడపాల్సిందిగా పట్టుబట్టారు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. అది తమ ఒప్పందంలో లేని విషయమని.. అలా చేస్తే తన భర్తకు ఏం సమాధానం చెప్పుకోవాలంటూ ఆమె అక్కడి నుండి వెళ్లిపోతానని పట్టుబట్టింది. ఈ క్రమంలోనే ఆ యువతికి, ఇద్దరు వ్యక్తులతో గొడవ జరిగింది. తాను ఇంటికి వెళ్లాలని ఆ యువతి పట్టుబట్టినప్పటికీ వాళ్లు ఆమె మాట వినిపించుకోలేదు. దీంతో ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో వారి నుండి నగ్నంగానే తప్పించుకుని బయటికి పారిపోయి వచ్చిన యువతి.. రోడ్డుపై సహాయం కోసం అరవడం మొదలుపెట్టింది. తనను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని.. తనపై గ్యాంగ్ రేప్ చేసి ఇలా వివస్త్రను చేసి రోడ్డుపై వదిలేసి వెళ్లారని ఆరోపిస్తూ ఆ మార్గంలో వచ్చిపోయే వారిని సహాయం కోసం అరవడం మొదలుపెట్టింది. 


ఇది కూడా చదవండి : Illicit Affairs: మహిళతో వివాహేతర సంబంధం.. ఆమె కూతురిపైనా కన్నేశాడు.. కానీ ఇంతలోనే


ఆ యువతి ఎందుకు అబద్దం చెప్పిందంటే..
అయితే, అసలు విషయం తన భర్తకు తెలిస్తే.. అతడు తనని వదిలేస్తాడనే భయంతోనే ఆ మహిళ అలా కట్టుకథ అల్లి చెప్పిందని.. కానీ మహిళ ఫిర్యాదు మేరకు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. వారు ఆ యువతితో మాట్లాడుకున్న డీల్‌కి సంబంధించిన కాల్ రికార్డింగ్ బయటపెట్టడం వల్లే ఆమె తన ఇష్టంతోనే వారితో వెళ్లిందనే విషయం అర్థమైంది అని పోలీసులు తెలిపారు. తాను వారితో వెళ్లిన విషయాన్ని భర్తకు తెలియకుండా ఉండటం కోసమే ఆ యువతి ఈ కట్టుకథ అల్లింది అని భిల్వాడా పోలీసులు తెలిపారు. మొత్తానికి సంచలనం సృష్టించిన గ్యాంగ్ రేప్ కేసులో మహిళదే తప్పు ఉండటమే కాకుండా ఆమె కట్టుకథ అల్లి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని పోలీసులు నిగ్గు తేల్చేశారు. మహిళతో ఆ ఇద్దరు యువకులు డీల్ మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్ ఈ కేసులో అసలు వాస్తవాలు బయటికి వచ్చేలా చేసింది. ఇది కూడా చదవండి : 
Brother, Sister Got Married: పారిపోయి పెళ్లి చేసుకుని విజయవాడకు వచ్చిన అన్నాచెల్లెలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.