Anwarul Azim Anar Case: భారతదేశంలో బంగ్లాదేశ్‌ ఎంపీ దారుణ హత్యకు గురవడం వెనుక అనేక విస్తుగొలిపే విషయాలు తెలుస్తున్నాయి. పక్కా ప్రణాళిక ప్రకారం అతడి హత్య జరిగిందని తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్న కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో సంచలన విషయం బయటకు వచ్చింది. ఆయన చర్మాన్ని ఒలిచి ముక్కలు ముక్కలుగా చేసినట్లు తెలిసింది. అయితే అతడిని హత్య చేసేందుకు ఓ అమ్మాయిని వలగా విసిరారు. మహిళ ద్వారా అతడిని లోబర్చుకుని భారతదేశానికి పిలిపించుకుని హత్యకు పాల్పడ్డారు. ఈ విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Thunderbolt: అమ్మమ్మ ఇంట్లో విషాదం.. క్రికెట్‌ ఆడుతున్న యువకుడిని బలిగొన్న పిడుగు


 


బంగ్లాదేశ్‌కు చెందిన ఎంపీ మహమ్మద్‌ అన్వర్‌ ఉల్‌ అనర్‌ (56) భారత్‌లోని పశ్చిమ బెంగాల్‌లో హత్యకు గురయిన విషయం తెలిసిందే. అతడి హత్యోదంతం బెంగాల్‌లోనూ.. బంగ్లాదేశ్‌లోనూ సంచలనంగా మారింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు విచారణను తీవ్రం చేశారు. విచారణ క్రమంలో బంగ్లా నుంచి అక్రమంగా వచ్చిన ఓ వలసదారుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరు జిహాద్‌ హవల్దార్‌. ఎంపీ హత్యలో అతడే కీలకంగా భావిస్తున్నారు. అతడిని విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యలో ఓ మహిళ కీలక పాత్ర పోషించిందని తెలిసింది. ఆ మహిళ ద్వారా ఎంపీని వలలోకి వేసుకుని హత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది.

Also Read: Brutally Murder: తెలంగాణలో మరో రాజకీయ హత్య.. మంచంపై పడుకున్న నాయకుడిపై క్రూరంగా దాడి


 


అన్వర్‌ కోల్‌కత్తాలోని టౌన్‌హాల్‌ ప్రాంతంలో మే 12వ తేదీన అమెరికాలోని తన స్నేహితుడి ఇంట్లో బస చేశారు. ఆ ప్రాంతంలోని సీసీ టీవీ రికార్డులు పరిశీలించగా కొన్ని విషయలు తెలిశాయి. అపార్ట్‌మెంట్‌లోకి ఇద్దరు పురుషులు, ఒక మహిళతో కలిసి ఎంపీ అన్వర్‌ లోపలికి వెళ్లారు. అనంతరం ఎంపీ అదృశ్యమయ్యారు. వారం తర్వాత అతడు హత్యకు గురయ్యాడు. అతడి మృతదేహం ఇప్పటివరకు లభించలేదు. కాకపోతే విచారణ సమయంలో హవల్దార్‌ చెప్పిన విషయాలు పరిశీలిస్తే ఎంపీ మృతదేహం ముక్కలు ముక్కలుగా ఎక్కడెక్కడో పడేసినట్లు తెలుస్తోంది. 


'ఎంపీని అత్యంత దారుణంగా హత్య చేసి ఆయన మృతదేహాన్ని గుర్తించడానికి వీలు లేకుండా చేసినట్లు హవల్దార్‌ అంగీకరించాడు. ఈ హత్య వెనుక ఎంపీ స్నేహితుడు అమెరికాలో నివసిస్తున్న అక్తరుజమాన్‌ ఉన్నట్టు హవల్దార్‌ చెప్పాడు. అతడు చెప్పినట్టు తాను చేసినట్లు హవల్దార్‌ విచారణలో వెల్లడించాడు' అని బెంగాల్‌ సీఐడీ అధికారి ఒకరు తెలిపారు. 'ఎంపీ చర్మాన్ని వేరు చేశారు. వాసన రాకుండా ఉండేందుకు కోసిన శరీర భాగాలకు పసుపు కలిపి పెట్టినట్లు కనిపిస్తోంది. ఎంపీ శరీర భాగాలను ప్లాస్టిక్‌ బ్యాగుల్లో తీసుకని పలు ప్రదేశాల్లో కూడా పడేసి ఉండవచ్చు. ఇంకొన్ని భాగాలను ఫ్రిజ్‌లో దాచి పెట్టారని నిర్ధారించాం. అక్కడి నుంచి నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించాం' అని బెంగాల్‌ పోలీసులు తెలిపారు. త్వరితగతిన విచారణ చేపట్టి కేసును ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు. కాగా, తమ ఎంపీ హత్యపై బంగ్లాదేశ్‌ ప్రభుత్వం భారత్‌ నుంచి ఎప్పటికప్పు వివరాలు తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ దేశం కోరుతోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter