Shraddha Instagram Chat: శ్రద్ధా హత్య కేసులో వరుసగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు అఫ్తాబ్ పూనావాలా పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటపెడుతున్నాడు. తాజాగా శ్రద్ధా హత్య కేసుకు సంబంధించి మరో కీలక ఆధారం దొరికింది. శ్రద్ధా వాకర్ చివరి ఇన్‌స్టాగ్రామ్ చాట్‌ను పోలీసులు గుర్తించారు. తన చివరి చాట్‌లో శ్రద్ధా తన స్నేహితుడు కరణ్‌తో కొన్ని విషయాలు పంచుకోవాలని మెసేజ్ పంపించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరణ్‌ అనే యువకుడు శ్రద్ధాకు, అఫ్తాబ్‌కు కామన్ ఫ్రెండ్. ఇన్‌స్టాగ్రామ్‌లో కరణ్‌కు మెసేజ్ చేసిన శ్రద్దా.. చాలా విషయాలు చెప్పాలని తెలిపింది. అయితే ప్రస్తుతం పనిలో బిజీగా ఉన్నానని చెప్పింది. ఆ తరువాత కరణ్ ఆమెకు చాలా మెసేజ్‌లు పెట్టినా.. అయితే శ్రద్ధా నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఏం విషయాలు ఉన్నాయి..? మీరు క్షేమంగా ఉన్నారా..? అని కరణ్ మెసేజ్‌లో అడిగాడు. ఆ మెసేజ్‌ను చదివినట్లు ఉన్నా.. ఎటువంటి రిప్లై రాలేదు. శ్రద్ధాను హత్య చేసిన తరువాత ఆమె మొబైల్ తీసుకుని అఫ్తాబ్ ఇన్‌స్టాగ్రామ్ వాడినట్లు తెలుస్తోంది.


హత్య జరిగిన మే 18న అఫ్తాబ్ మూడు రంపపు బ్లేడ్‌లు, సుత్తిని కొనుగోలు చేయడమే కాకుండా 250 గ్రాముల పెద్ద మేకులను కూడా కొనుగోలు చేశాడు. ఢిల్లీలోని ఛతర్‌పూర్ హిల్‌లోని షాప్‌లో అఫ్తాబ్ ఈ వస్తువులను ఎందుకు కొనుగోలు చేశాడనే దానిపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. గురుగ్రామ్‌లోని డీఎల్‌ఎఫ్ ఫేజ్-III అటవీ ప్రాంతంలో శ్రద్ధా మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికివేయడానికి ఉపయోగించిన ఆయుధాన్ని, సాధనాలను తాను పడవేసినట్లు నిందితుడు విచారణలో చెప్పాడు. ఆమె మృతదేహాన్ని ముక్కలు చేయాడానికి ఉపోయోగించిన ఆయుధాలను పోలీసులు ఇంకా లభించలేదు. 


అఫ్తాబ్ కోసం కుటుంబ సభ్యులను వదిలేసి రావడం శాపంగా మారింది. అఫ్తాబ్ తనను చంపి ముక్కలుగా నరికేయాలనుకుంటున్నాడని శ్రద్ధా అప్పటికే భయపడిపోయిందని, 2020లో వసాయ్ పోలీసులకు శ్రద్ధా చేసిన ఫిర్యాదులో వెల్లడైంది. 


అఫ్తాబ్ కుటుంబీకుల వాంగ్మూలం నమోదు  


శ్రద్ధా హత్య తరువాత అఫ్తాబ్ కుటుంబం కనిపించకుండా పోయింది. ఢిల్లీ పోలీసులు చాలా కాలంగా వారి కోసం వెతుకుతుండగా.. అఫ్తాబ్ కుటుంబ సభ్యులు బయటకు వచ్చారు. ప్రస్తుతం అఫ్తాబ్ కుటుంబీకుల వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. అఫ్తాబ్, శ్రద్ధా మధ్య సంబంధం గురించి ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్ కుటుంబాన్ని విచారించారు. హత్య తర్వాత అఫ్తాబ్ కూడా ముంబైకి వచ్చాడని చెప్పారు. 


Also Read: Minister Malla Reddy: మహేందర్ రెడ్డికి అస్వస్థత.. తన కొడుకును కొట్టారని మంత్రి మల్లారెడ్డి ఆరోపణలు   


Also Read: Grahan 2023 Dates: ఈ రెండు గ్రహణాలు మన దేశంలో కనిపించవు.. వచ్చే ఏడాదిలో సూర్య, చంద్రగ్రహణం తేదీలు ఇవే..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి