Minister Malla Reddy: మహేందర్ రెడ్డికి అస్వస్థత.. తన కొడుకును కొట్టారని మంత్రి మల్లారెడ్డి ఆరోపణలు

Malla Redddy Son Hospitalized: మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను సురారంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. తన కొడుకును కొట్టారంటూ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2022, 11:53 AM IST
  • మహేందర్ రెడ్డికి అస్వస్థత
  • సురారంలోని ఆస్పత్రికి తరలింపు
  • అధికారులపై మల్లారెడ్డి ఫైర్
Minister Malla Reddy: మహేందర్ రెడ్డికి అస్వస్థత.. తన కొడుకును కొట్టారని మంత్రి మల్లారెడ్డి ఆరోపణలు

Malla Redddy Son Hospitalized: తెలంగాణలో కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు మరింత పెరిగింది. కీలక నేతలే లక్ష్యంగా పంజా విసురుతున్నాయి. ఇప్పటికే చీకోటి ప్రవీణ్ కేసినో, గ్రానైట్ కేసుల్లో ఈడీ దర్యాప్తు సాగుతోంది. కేసినో వ్యవహారంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులతో పాటు పీఏను ఈడీ ప్రశ్నించింది. గ్రానెట్ అక్రమాలకు సంబంధించి మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు అతని వియ్యంకుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరిగాయి. ఇక ఐటీగా ఎంటర్ అయి.. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డిపై మెరుపు దాడులకు దిగిన విషయం తెలిసిందే. మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము మొదలైన సోదాలు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.

ఐటీ దాడులు ముమ్మరంగా సాగుతుండగా.. మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే సూరారంలోని ఓ హస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పేద విద్యార్థులకు తక్కువ ఫీజుకే విద్యను అందిస్తున్న తమ కుటుంబంపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తామేం దొంగతనానికి పాల్పడలేదని.. కేసినోలు నిర్వహించలేదన్నారు. రాత్రి సమయంలో తన కొడుకును ఇబ్బంది పెట్టడంతోనే ఛాతిలో నొప్పివచ్చిందన్నారు. బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 400 మంది సీఆర్పీఎఫ్ పోలీసులతో మోదీ ప్రభుత్వం తమపై దాడి చేయిచిందని ఫైర్ అయ్యారు.

మహేందర్ రెడ్డి మల్లారెడ్డి కాలేజీలకు డైరెక్టర్‌గా ఉన్న విషయం తెలిసిందే. అదేవిధంగా పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో కూడా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. మంగళవారం రాత్రి వరకు జరిగిన సోదాల్లో ఆదాయ పన్ను విభాగం అధికారులు 4 కోట్ల రూపాయల నగదు గుర్తించినట్లు తెలిసింది.

Also Read: Grahan 2023 Dates: ఈ రెండు గ్రహణాలు మన దేశంలో కనిపించవు.. వచ్చే ఏడాదిలో సూర్య, చంద్రగ్రహణం తేదీలు ఇవే..  

Also Read: Krishna : కృష్ణ-విజయనిర్మల ఆస్తుల పంపకాల్లో వివాదం.. అసలు నిజం బయటపెట్టిన నిర్మాత!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News