Oyo Town House Death: ఏడేళ్లు ప్రేమించుకున్నారు.. పెళ్లి కాకుండానే కలిసి జీవిస్తున్నారు. శుభకార్యం కోసం హైదరాబాద్‌కు వచ్చారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఓయో రూమ్‌లో ప్రియుడు బాత్రూమ్‌లో నిర్జీవంగా పడి ఉన్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ తన ప్రియుడు చనిపోవడంతో ఆ యువతి నిర్ఘాంతపోయింది. అతడు ఎలా మరణించాడనేది తెలియడం లేదు. ఆత్మహత్యకు పాల్పడ్డడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆ యువతి తీరుపై కూడా సందేహాలు వస్తున్నాయి. పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Vijayawada Doctor Family: డాక్టర్‌ కుటుంబం కేసులో బిగ్‌ట్విస్ట్‌.. నలుగురి పీక కోసి ఆపై తాను ఆత్మహత్య


మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లకు చెందిన హేమంత్‌ (28) ఇటుకల వ్యాపారం చేస్తుండేవాడు. అదే ప్రాంతానికి చెందిన యువతి (27)తో హేమంత్‌కు ఏడేళ్ల కిందట పరిచయమై ప్రేమగా మారింది. వారిద్దరూ తరచూ కలుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే శుభకార్యం కోసం సోమవారం (మే 29) హైదరాబాద్‌ వచ్చారు. శుభకార్యానికి వెళ్లి వచ్చిన అనంతరం రాత్ర ఎస్సార్‌నగర్‌లోని ఓయో టౌన్‌హౌస్‌లో వీరిద్దరూ దిగారు. మద్యం సేవించిన హేమంత్‌ అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో బాత్రూమ్‌ కోసం లేచాడు. లోపలకు వెళ్లి ఎంత సేపయినా హేమంత్‌ బయటకు రాకపోవడంతో ఆ యువతి కంగారుపడింది. లోపలికి వెళ్లి చూడగా హేమంత్‌ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. అతడిని చూసి నిర్ఘాంతపోయిన యువతి భయాందోళన చెందింది.

Also Read: Tragedy Incident: నలుగురి ప్రాణం తీసిన 'పుట్టినరోజు పార్టీ'.. చావులోనూ వీడని స్నేహం


వెంటనే హేమంత్‌ స్నేహితులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా వారు వచ్చి చూసి హేమంత్‌ చనిపోయాడని నిర్ధారించారు. హేమంత్‌ తల్లి అక్కడకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎస్సార్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. హేమంత్‌ వెంట వచ్చిన ప్రియురాలి పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ యువతిని పోలీసులు విచారణ చేస్తున్నారు.


వారిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయా? వారు ఏమైనా గొడవ పడ్డారా? అనే సందేహాలు వస్తున్నాయి. లేకపోతే వారి పెళ్లికి కుటుంబసభ్యులు అంగీకరించడం లేదని హేమంత్‌ ఆత్మహత్యకు పాల్పడ్డడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది కాకుంటే మద్యం ఎక్కువై అతడు అస్వస్థతకు గురయ్యాడని కూడా అని కూడా తెలుస్తోంది. ఫిర్యాదు మేరకు పోలీసులు హేమంత్‌ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం అతడి మృతికి కారణాలు ఏంటో తెలియనున్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter