Nellore: నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. దోపిడీ కోసం వచ్చిన దుండగులు దారుణానికి పాల్పడ్డారు. భార్యాభర్తలను అతి కిరాతకంగా హత మార్చారు. ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. నెల్లూరులో పడారుపల్లి సమీపంలోని అశోక్‌నగర్‌లో వాసిరెడ్డి కృష్ణారావు, సునీత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ప్రేమ్‌చంద్, సాయిచంద్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరికి వివాహాలు కావడంతో విడివిడిగా నివసిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెద్ద కుమారుడు విశాఖలోని పోస్టల్ శాఖలో పనిచేస్తున్నాడు. చిన్న కుమారుడు నెల్లూరులోని పొగతోటలో హోటల్‌ చూసుకుంటున్నాడు. అశోక్‌నగర్‌లో కృష్ణారావు, సునీత మాత్రమే నివసిస్తున్నారు. స్థానికంగా కృష్ణారావు కరెంట్ ఆఫీస్‌ సెంటర్‌ వద్ద శ్రీరామ్‌ పేరుతో క్యాటరింగ్, హోటల్ నడుపుతున్నాడు. అందరూ సెటిల్ కావడంతో ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ప్రతి రోజూ కృష్ణారావు హోటల్ పనులు పూర్తి చేసుకుని రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చేవాడు.


రోజువారి లాగే భర్త వస్తాడని సునీత బయట తలుపులకు తాళం వేయకుండా నిద్రించింది. అప్పటికే ఇంటిపై దుండగులు రెక్కీ నిర్వహించారు. ఇంట్లో ఒక్కరే ఉంటారని గ్రహించి లోపలికి వెళ్లారు. బెడ్‌రూమ్‌లో ఉన్న సునీత తలపై కర్రతో బాదారు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం నగదు, బంగారు, ఆభరణాల కోసం దుండగులు ఇంట్లో అన్వేషించారు. చివరకు రెండు లాకర్లను గుర్తించారు. 


అందులో ఒకటి మాత్రమే ఓపెన్ అయ్యింది. ఓ దాంట్లో హోటల్‌కు సంబంధించిన పత్రాలు మాత్రమే ఉన్నాయి. నగదు, బంగారు, ఆభరణాలు ఉన్న లాకర్ తెరుచుకోలేదు. దీంతో వారు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. అప్పుడే దుండగులకు ఇంటి యజమాని కృష్ణారావు కనిపించాడు. వెంటనే దొంగలు అంటూ కేకలు వేశాడు. ఈక్రమంలోనే విషయం బయట పడుతుందని భావించి..అతనిపై కత్తితో దాడి చేశారు. దీంతో కృష్ణారావు స్పాట్‌లోనే మృతి చెందాడు. 


ఆ వెంటనే నిందితులంతా అక్కడి నుంచే పరారైయ్యారు. తెల్లవారుజామున పని మనిషి ఇంటికి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దారుణాన్ని కృష్ణారావు కుమారులకు తెలియజేసింది. వారంతా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలిని నగర ఇన్‌ఛార్జ్ డీఎస్పీ అబ్దుల్ సుబహాన్, స్థానిక ఇన్‌స్పెక్టర్ నరసింహారావు పరిశీలించారు. దోపిడీ ఎలా జరిగింది..హత్యలు ఎలా చేశారన్న దానిపై ఆరా తీశారు. ఈకేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. 


Also read:Viral Video: ఆండ్రీ రసెల్ అరుదైన ఫీట్..ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన ఆల్‌రౌండర్..!


Also read:Asia Cup 2022: ఇవాళ భారత్, పాక్ హైవోల్టేజ్‌ మ్యాచ్..పుజారా ప్లేయింగ్ ఎలవన్‌లో ఎవరెవరున్నారంటే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి