CSK Fan Died: ఐపీఎల్‌లో విషాదం.. రోహిత్ శర్మ ఔట్‌పై వివాదం.. సీఎస్కే అభిమాని మృతి
CSK Fan Died For Celebrates Rohit Sharma Wicket In SRH Vs MI Match: ఐపీఎల్ మ్యాచ్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఔట్ విషయంలో సంబరాలు చేసుకున్నాడనే ఉద్దేశంతో ఓ జట్టు అభిమానులు దాడి చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం రేపింది.
CSK Fan Death: రెండు జట్ల మధ్య ఆట కొనసాగుతున్న సమయంలో వికెట్ పడిన విషయంలో గొడవ మొదలైంది. వికెట్ కోల్పోయిన ఆనందంలో సంబరం చేసుకుంటున్న ఓ జట్టు అభిమానిపై ఇతర జట్టు అభిమానులు దాడి చేశారు. మూకుమ్మడి దాడి చేయడంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. చివరికి అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన ఐపీఎల్‌లో విషాదం నింపింది.
Also Read: IPL DC Vs CSK Live: చెన్నైకి ఢిల్లీ షాక్.. చాన్నాళ్లకు ధోనీ మెరిసినా తప్పని ఓటమి
మార్చి 27వ తేదీన ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ను మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా హన్మంత్‌వాడికి చెందిన బందోపంత్ బాపుసో తిబిలే ఆసక్తిగా తిలకిస్తున్నాడు. ఈయన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అభిమాని. ముంబై, హైదరాబాద్ మ్యాచ్‌ను స్థానికులైన సాగర్ సదాశివ్ జంజగే, బల్వంత్ మహదేశ్ జంజగేతో కలిసి చూస్తున్నాడు. వీరిద్దరూ ముంబై జట్టు అభిమానులు. మ్యాచ్ చూస్తున్న సమయంలో రోహిత్ శర్మ వికెట్ పడడంతో బాపుసో తిబిలే పరమానందం వ్యక్తం చేశాడు. రోహిత్ వికెట్ పడిన ఆనందంలో సంబరాలు చేసుకుంటుండడంతో ముంబై అభిమానులైన మిగతా ఇద్దరికి కోపం వచ్చింది.
Also Read: RCB vs KKR Live Score: విరాట్ కోహ్లీ శ్రమ వృథా.. కేకేఆర్ చేతిలో బెంగళూరు బోల్తా
క్షణికావేశానికి లోనైన సాగర్, బల్వంత్‌లో ఆ సమయంలో కర్రలతో బాపుసో తిబిలేపై దాడి చేశారు. వారి చేతిలో తీవ్ర గాయాలపాలవడంతో స్థానికులు అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన ఆదివారం మృతి చెందాడు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే మద్యంమత్తులో ఈ గొడవ జరిగిందని తెలిసింది. ఐపీఎల్ మ్యాచ్ ఒక ప్రాణం బలితీయడం చర్చనీయాంశంగా మారింది. బాపుసో తిబిలే మృతికి కారణమైన ముంబై ఇండియన్స్ జట్టు అభిమానులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook