Delhi Girl Murdered By Boyfriend: ఢిల్లీలో మరో సంచలన హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల బాలికను ప్రియుడే విచాక్షణ రహితంగా కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె తలపై బండరాయితో పలుమార్లు వేసి కిరాతంగా వ్యవహరించాడు. బాలికపై ఆ కిరాతుకుడు దారుణంగా వ్యవహరిస్తున్నా.. అక్కడ ఉన్న వారు చూస్తుండి పోయారు తప్ప.. ఒక్కరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయింది. బాలికపై 16 సార్లు కత్తితో దాడి జరిగినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ప్రాథమికంగా వెల్లడైంది. ఈ హత్య కేసులో నిందితుడైన సాహిల్ అనే యువకుడిని యూపీలోని బులంద్‌షహర్ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ రోహిణి ప్రాంతంలోని షాబాద్‌ డెయిరీ ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలిక, సాహిల్ అనే యువకుడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఇటీవల వీరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఫ్రెండ్ బర్త్ డే వేడుకలకు ఆ బాలిక వెళుతుండగా.. సాహిల్ వచ్చి దాడి చేశాడు. షాబాద్ డెయిరీ వద్ద అందరూ చూస్తుండగానే.. కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. ఆమె అడ్డుకునేందుకు యత్నించినా శక్తి చాలలేదు. కత్తితో దాడి చేయడంతో బాలిక కిందపడిపోగా.. ఇష్టానుసారం కాలితో తన్నాడు. అనంతరం ఓ బండరాయితో తీసుకుని బాలిక తలపై వేశాడు. పలుమార్లు బండరాయితో మోదాడు. ఈ ఘటనను అందరూ చూస్తుండగానే జరిగింది. అక్కడ ఉన్న వారు అడ్డుకునే ప్రయత్నం చేయకుండా.. ఏదో సినిమా చూసినట్లు చూసుకుంటు ఉండిపోయారు. 


బాలికను దారుణంగా హత్య చేసిన యువకుడు.. ముందుకు వెళ్లి తిరిగి మళ్లీ వెనక్కి వచ్చాడు. మరోసారి బండరాయిను మృతదేహంపై విసిరి కాలితో తన్నాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. నిందితుడు సాహిల్‌గా గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ సమీపంలో నిందితుడు ఉండగా.. పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను సేకరించి.. నిందితుడికి కఠినంగా శిక్షపడేలా చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. 


నిందితుడిని వదిలిపెట్టకూడదని.. కఠినంగా శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. తమ కూతురిని అన్యాయంగా చంపేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురిలా మరో ఆడబిడ్డకు జరగకుండా.. నిందితుడిని ఉరి తీయాలని కోరారు. మృతురాలి తండ్రి కూలీగా పనిచేస్తున్నాడు. ఈ ఘటనపై మహిళా కమిషన్‌ సీరియస్ అయింది. నిష్పాక్షపాతంగా విచారణ జరిపించాలని పోలీసులను ఆదేశించింది. కమిషన్ ముగ్గురు సభ్యుల దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. తన జీవితంలో ఇలాంటి ఘోరాన్ని చూడలేదని మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌ అన్నారు. ఢిల్లీలో నేరగాళ్లకు అడ్డూ అదుపులేకుండా పోయిందని.. పోలీసులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.


Also Read: Aadhaar Card Update: జూన్ 14వ వరకు ఫ్రీ సర్వీస్.. ఆధార్‌ను ఇలా అప్‌డేట్ చేసుకోండి  


Also Read: BGMI Returns: పబ్జీ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. BGMI వచ్చేసింది.. కండీషన్స్ అప్లై  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook