Gujarat: తాను ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్లిపోయి సంవత్సరాలు గడిచిన అతడు వదలలేదు. తాను కాదన్న ప్రియురాలిపై కక్ష తీర్చుకోవాలని పంతం పట్టాడు. ఒక స్పీకర్‌ లాంటి వస్తువులో బాంబు పెట్టి ప్రియురాలు ఇంటికి పంపించాడు. అది తెరవగానే ప్రియురాలి కుటుంబంలో భర్త, అతడి కూతురు చనిపోయింది. ఈ సంఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Bulandshahr: పాముకాటుతో మృతి.. బతుకుతాడనే ఆశతో మృతదేహాన్ని నదిలో ముంచిన కుటుంబం


గుజరాత్‌లోని సబర్కాంత జిల్లా వేద అనే గ్రామంలో జీతూబాయ్‌ హీరాబాయ్‌ వంజారా (32) తన భార్యాపిల్లలతో నివసిస్తున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే మే 2వ తేదీన ఇంటికి ఓ పార్సిల్‌ రావడంతో జీతూభాయ్‌ తన కుమార్తె భూమిక (12)తో కలిసి తెరిచాడు. పార్సిల్‌ తెరచి ఆన్‌ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. తీవ్ర గాయాలతో జీతూభాయ్‌ అక్కడికక్కడే మృతిచెందగా.. భూమిక గాయాలపాలైంది. ఆస్పత్రికి తరలించే క్రమంలో బాలిక కూడా మృతి చెందింది. ఇంట్లో ఉన్న మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: Online Games: ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసైన విద్యార్థులు.. సొంతింట్లోనే రూ.40 లక్షల ఆభరణాలు చోరీ


దర్యాప్తు క్రమంలో సంచలన విషయం తెలిసింది. జీతూబాయ్‌ భార్యను బాలుసింగ్‌ వంజారా (31) అనే వ్యక్తి ప్రధాన నిందితుడిగా గుర్తించారు. తాను ప్రేమించిన అమ్మాయిని జీతూబాయ్‌ వివాహం చేసుకున్నాడనే అక్కసుతో బాలుసింగ్‌ కోపంతో రగిలి పోతున్నాడు. ఎప్పటి నుంచో కక్ష తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలోనే బాంబు పెట్టి వారి కుటుంబాన్ని బలిగొన్నాడు. ఈ విషయం సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా బాలుసింగ్ చిక్కాడు. అయితే ఆ పార్సిల్‌ను ఓ రిక్షా కార్మికుడికి రూ.200 ఇచ్చి పంపించాడు. అతడిని విచారించగా బాలుసింగ్‌ నేరం బయటపడింది.


ప్రేమించిన యువతిపై మనసుపడిన బాలు సింగ్‌ పెళ్లి చేసుకోకపోవడంతో తీవ్రంగా మదనపడుతున్నాడు. ఎప్పటి నుంచో ప్రేయసి కుటుంబంపై పగ తీర్చుకోవాలని రగిలిపోతున్నాడు. ఈ క్రమంలోనే రాజస్థాన్‌కు వెళ్లి బాంబు తయారు కోసం పదార్థాలు కొనుగోలు చేశాడు. వాటితో టేప్‌ రికార్డర్ తయారుచేసి అది పేలేలా తయారు చేశాడు. ప్లగ్‌ పెట్టి ఆన్‌ చేయగానే అది పేలింది. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళన చెందారు. బాంబు పేలుడుగా భావించి పోలీసులు వివిధ విభాగాలతో విచారణ చేపట్టారు. చివరకు ఇది ఉగ్ర ఘటన కాదని.. ప్రేమ కోణం అని తెలిసి భద్రతా దళాలు ఊపిరి పీల్చుకున్నాయి.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter