Snakebite Ganga River: మూఢనమ్మకమో.. తెలివి లేకనో కొందరు పిచ్చిగా వ్యవహారిస్తున్నారు. వారి పిచ్చితో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గతంలో ఒక మహిళ తన మేనల్లుడిని గంగానదిలో ముంచి బాలుడి మృతికి కారణమైంది. తాజాగా అదే గంగానదిలో పాముకాటుతో మృతి చెందిన ఓ యువకుడి మృతదేహాన్ని తాళ్లతో కట్టి మానవత్వం లేకుండా ముంచారు. అలా చేస్తే పాము కరిచిన విషం తగ్గి అతడు మళ్లీ ప్రాణం వస్తుందని నమ్మారు. ఈ అమానవీయ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
Also Read: SR Nagar Oyo Death: ఓయో రూమ్ బాత్రూమ్‌లో ప్రియుడు ఆకస్మిక మృతి.. ప్రియురాలే చంపిందా?
బులంద్‌షహర్ జిల్లా జైరాంపూర్ కుడేనా గ్రామానికి చెందిన మోహిత్ కుమార్ (20) బీకామ్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలకు సన్నద్ధమవుతున్న సమయంలో ఏప్రిల్ 26వ తేదీన మోహతికుమర్ ఓ పార్క్‌కు వెళ్లాడు. అక్కడ పాము కాటు వేయడంతో కుప్పకూలాడు. అతడిని గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మోహిత్ మరణించాడని వైద్యులు నిర్ధారించారు. అయితే కుటుంబసభ్యులు మాత్రం అతడు మరణించలేదని భావించారు. స్థానికంగా ఉన్న నాటువైద్యుడి వద్దకు వెళ్లారు. అక్కడ కూడా మీ కుమారుడు మరణించాడని చెప్పినా కుటుంబసభ్యులు వినిపించుకోలేదు.
పాము కాటు విషం తొలగుతే మోహిత్ కుమార్ తిరిగి బతుకాడని కుటుంబసభ్యులు భావించారు. అలాగే మృతదేహాన్ని తీసుకెళ్లి సమీపంలోని గంగానదికి తీసుకెళ్లారు. నది వద్దకు వెళ్లి మృతదేహం తలకు తాళ్లకు కట్టారు. రెండు రాళ్ల మధ్య తాడు కట్టేసి మృతదేహాన్ని నీళ్లలో ముంచారు. అలా చేస్తే అతడి దేహంలోని విషయం బయటకు వెళ్లి మోహిత్ కుమార్ బతుకుతాడని భావించారు. ఎంతకీ అతడు ప్రాణం పోసుకోకపోవడంతో కుటుంబసభ్యులు నిరాశ చెందారు. ఈ చర్యను స్థానికులు అందరూ ఆగ్రహం వ్యక్తం చేయడంతో కుటుంబీకులు కొద్దిసేపటికి మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం అక్కడే గంగాఘాట్‌లో మోహిత్ కుమార్ అంత్యక్రియలు జరిపించారు.
20 वर्षीय मोहित कुमार को सांप ने काट लिया। अंधविश्वास में फैमिली वालों ने उसको 2 दिन तक गंगा में लटकाए रखा। उन्हें ऐसा बताया गया था कि गंगा के बहते जल में शरीर को रखने से जहर उतर जाता है। लेकिन मोहित जिंदा नहीं हुआ। जिसके बाद उसका अंतिम संस्कार किया गया।
📍बुलंदशहर, उत्तर प्रदेश pic.twitter.com/JDY5XupSl1
— Sachin Gupta (@SachinGuptaUP) May 2, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Bulandshahr: పాముకాటుతో మృతి.. బతుకుతాడనే ఆశతో మృతదేహాన్ని నదిలో ముంచిన కుటుంబం