Fake RPF SI: పోలీస్‌ అధికారిగా చెప్పుకుంటూ ఎస్సైగా చలామణీ అవుతున్న ఓ యువతి బండారం బయటపడింది. ఎస్సై ఉద్యోగ అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్న ఆమె ఉద్యోగం రాకున్నా నకిలీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా అవతారం ఎత్తింది. ఎస్సై కావాలనే కల తీరకపోవడంతో ఏడాది కాలంగా ఆమె సూడో ఎస్సైగా స్థానికంగా చలామణీ అవుతోంది. సొంత ఇంట్లో వారికి కూడా అబద్ధాలు చెబుతూ కాలం వెళ్లదీసింది. అయితే పెళ్లిచూపుల కోసం వచ్చిన ఓ యువకుడి కుటుంబసభ్యుల ద్వారా ఆమె విశ్వరూపం బహిర్గతమైంది. పెళ్లిచూపుల అనంతరం యువతి చెబుతున్న ఎస్సై ఉద్యోగం ఎక్కడా అని ఆరా తీయగా ఆమె చేస్తున్న మోసం బయటపడింది. ఎస్సై కాకుండానే ఎస్సైగా చెబుతున్నట్టు తేలడంతో యువకుడి కుటుంబసభ్యులు ఖంగుతిన్నారు. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Daughter Killed: ఇంట్లో బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా కుమార్తె.. ఇది చూసిన తల్లి


హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ ఆర్పీఎఫ్‌ (రైల్వే రక్షణ దళం) ఎస్సై అని చెప్పుకుంటూ తిరుగుతున్న ఓ యువతిని రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. రైల్వే పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లికి చెందిన మాళవిక హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. ఎస్సై కావాలని చిన్నప్పటి నుంచి కలలు కంటోంది. 2018లో ఆర్‌పీఎస్‌ ఎస్సై పరీక్ష రాసి ఉద్యోగానికి చేరువగా చేరింది. తుది ప్రక్రియలో మాళవికకు ఉన్న ఓ లోపం ద్వారా ఎస్సై ఉద్యోగం దూరమైంది. కంటి సమస్య ఉండడంతో వైద్య పరీక్షల్లో మాళవిక అర్హత సాధించలేకపోయింది. దీని ద్వారా ఎస్సై ఉద్యోగం రాలేదు.

Also Read: Tragedy: షాకింగ్‌ ఘటన.. స్నేహితుడి పెళ్లి బరాత్‌లో డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలిన యువకుడు 


ఇక్కడే అసలు ట్విస్ట్‌ ఉంది. తనకు చూపు సమస్య ఉందని తల్లిదండ్రులు బాధపడుతున్నారని మాళవిక భావించింది. దీంతో ఎస్సైగా ఎంపికయ్యాయని అబద్ధం చెప్పింది. ఆర్‌పీఎఫ్ ఎస్సై అని చెప్పుకుని యూనిఫాం, ఐడీ కార్డులు కూడా తయారు చేసుకుంది. శంకర్‌పల్లిలో విధులు నిర్వహిస్తున్నట్లు అందరినీ నమ్మిస్తోంది. నార్కట్‌పల్లి గ్రామంలో ఎస్సైగా మాళవిక చలామణి అవుతోంది. ఈ క్రమంలో కుటుంబసభ్యులు మాళవికకు పెళ్లి సంబంధాలు చూశారు.


ఎస్సైగా ఎంత నమ్మించాలనే ప్రయత్నం చేస్తుందో ఈ ఒక్క సంఘటన చెబుతోంది. పెళ్లి సంబంధం చూడగా అక్కడ కూడా మాళవిక పోలీస్‌ యూనిఫాంలోనే కనిపించింది. అంతలా ఎస్సైగా నమ్మిచేందుకు కష్టపడింది. అయితే పెళ్లి సంబంధాల కోసం అబ్బాయి తరఫు వాళ్లు మాళవిక ఎక్కడ ఉద్యోగం చేస్తుందో కనుక్కునేందుకు రైల్వే పోలీస్‌ శాఖ ఉన్నత అధికారులను సంప్రదించారు. అక్కడ మాళవిక అసలు రూపం బయటపడింది. అసలు మాళవిక పేరు మీద ఎవరూ ఎస్సై లేరని రైల్వే అధికారులు చెప్పారు. శంకర్‌పల్లిలో కూడా మాళవిక అనే ఎస్సై లేదని తేలింది.


అయితే మాళవిక చేస్తున్న మోసం విషయాన్ని యువకుడి కుటుంబసభ్యులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైల్వే పోలీసుల సమాచారం మేరకు నార్కట్‌పల్లి పోలీసులు రంగంలోకి దిగి మాళవికను అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో మాళవిక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఉద్యోగం రాలేదని చెబితే తల్లితండ్రులు బాధపడుతుండడంతో నకిలీ ఎస్సైగా కనిపించినట్లు మాళవిక తెలిపింది. తన కంటి సమస్యతో కుటుంబీకులు ఇప్పటికీ బాధపడుతున్నారని.. ఇప్పుడు ఉద్యోగం రాలేదంటే తట్టుకోలేరనే భయంతో ఇలా చేసినట్లు తెలిసింది. కాగా ఎస్సైగా మాళవిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫొటోలు, వీడియోలతో హల్‌చల్‌ చేసింది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter