Anakapalle News: అనకాపల్లిలో విషాదం.. అప్పుల బాధతో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
Anakapalle Family Suicide: అనకాపల్లిలో అప్పుల బాధ తాళలేక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. నలుగురు మరణించగా.. ఓ చిన్నారి ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Anakapalle Family Suicide: అనకాపల్లిలో పెను విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శివరామకృష్ణ (40) స్వర్ణకారుడు. గత కొంతకాలంగా కుటుంబంతో కలిసి అనకాపల్లిలోని వుడ్ పేట ఫైర్ స్టేషన్ పక్కన లక్ష్మీ పరదేశి అపార్ట్మెంట్‌లో నివసిస్తున్నాడు. శివరామకృష్ణకు భార్య మాధవి (38), కుమార్తెలు వైష్ణవి(16), లక్ష్మి(13), కుసుమప్రియ (9) ఉన్నారు. అప్పులు ఎక్కువ అవ్వడంతో శివరామకృష్ణ భార్య, పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
గురువారం రాత్రి అందరూ సైనేడ్ తాగారు. వీరిలో శివరామకృష్ణ, మాధవి, కుమార్తెలు వైష్ణవి, లక్ష్మి మరణించగా.. మరో కుమార్తె కుసుమప్రియ అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆ చిన్నారి ఆరోగ్యం కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పట్టణ సీఐ దాడి మోహన్ రావు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్నంలో పురుగులు మందు కలుపుకొని మృతి చెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter