Gang Rape On 13 Year Old Girl: దేశ రాజధాని ఢిల్లీకి మరోసారి దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల విద్యార్థినిపై కొందరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఏడు నెలల్లో రెండుసార్లు అత్యాచారం చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్వరూప్ నగర్ చెందిన బాలికపై ఎనిమిది మంది వ్యక్తులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నలుగురు మైనర్లను అరెస్టు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పోలీసుల వివరాల ప్రకారం.. బాధిత బాలిక స్వరూప్ నగర్ ప్రాంతంలో ఆమె కుటుంబంతో నివసిస్తోంది. జూన్ 23 సాయంత్రం ఏడు గంటల సమయంలో ఆ బాలిక తన స్నేహితురాలి ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చంపుతామని బెదిరించి అత్యాచారానికి ఆమెపై అత్యాచారం చేశారు. సుమారు నాలుగు గంటల తర్వాత ఆమెను ఆమె ఇంటి దారి వద్ద వదిలిపెట్టారు. ఆ బాధిత బాలిక ఇంటికి నడుచుకుంటూ వెళ్లే గ్రామంలో మరో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఆ ఎనిమిదేళ్ల బాలికను గుర్తు తెలియని ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను రాత్రి మూడు గంటల ప్రాంతంలో ఆమె ఇంటి వద్ద వదిలి వెళ్ళిపోయారు. 


Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా


బాధిత బాలిక ఇంటికి చేరుకోగానే జరిగిన మొత్తం విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలిపింది. బాలిక అందించిన సమాచారం మేరకు పోలీసులు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసుల నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. జూన్ 29వ తేదీన బాధితురాలు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలాలను సమర్పించింది. 



ఏడు నెలల క్రితం కూడా సామూహిక అత్యాచారం జరిగింది: 
బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలాలలో అనేక కొత్త విషయాలు బయటపడ్డాయి. గత ఏడు నెలల క్రితం తన తోటి స్నేహితుడి సోదరుడితో స్నేహం ఏర్పడిందని.. ఒకరోజు ట్యూషన్ కు వెళ్లే క్రమంలో దారి మధ్యలో వారిద్దరు కలిసి ఆమెను బైక్ పైకి ఎక్కించుకొని ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారని వాంగ్మూలాలలో పేర్కొంది. ఏడు నెలల క్రితం కూడా వాదిత బాలిక సామూహిక అత్యాచారానికి గురైందని ఆశ్చర్యపోయే నిజాలు బయటికి వెళ్లడయ్యాయి. మేజిస్ట్రేట్ ముందు కొత్త వాస్తవాలు తెరపైకి రావడంతో స్వరూప్ నగర్ పోలీస్ స్టేషన్‌లో మరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటివరకు నలుగురు మైనర్లను అరెస్టు చేయగా.. మరో నలుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook