Crime News: వాలెంటైన్స్ డే రోజు హై డ్రామా …హిందూ సంఘాలకు దొరికిన ప్రేమజంట
Valantines Day: వాలెంటైన్స్ డే వస్తోంది అంతే చాలు…యువజంటలకు.. ప్రేమికులకు సందడి మొదలవుతుంది. వాలెంటైన్స్ డే అనేది మన సంస్కృతి కాకపోయినా దానిని చాలా ప్రత్యేకంగా చూస్తారు యువత. అలాంటి ప్రేమికుల రోజు జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.
Crime on February 14: ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజున జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ప్రేమికుల రోజున హిందూ సంఘాలకు దొరికిన ప్రేమ జంట మధ్య ఒక హై డ్రామా నడిచింది. వాలెంటైన్స్ డే రోజు ఎవరన్నా ప్రేమ జంటలు బయట హిందూ సంఘాలకు కనిపిస్తే…జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం వాలెంటైన్స్ డే రోజు హిందూ సంఘాలకి ఒక అనుకోని సంఘటన ఎదురయ్యింది.. ఒక అమ్మాయి, అబ్బాయి వీరికి కనిపించగా..పెళ్ళి జరిగింది అంటూ అబ్బాయి, పెళ్ళి జరగలేదంటూ అమ్మాయి చెప్పుకొచ్చారు.
దీంతో అనుమానం వచ్చిన హిందూ సంఘం కార్యకర్తలు పెళ్లి జరిగినట్టు ఆధారాలు కావాలని కోరారు. తన దగ్గర ఆధారాలు లేకపోవడంతో ఆ ప్రేమికుడు అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లి డోర్ పెట్టి లాక్ వేసి పారిపోయారు. ఆ అబ్బాయి పేరు చంద్రగుప్తా కాగా..చంద్రగుప్త పై ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో రేప్ చేశాడు అంటూ ఫిర్యాదు చేసింది బాధితురాలు. ఇక బాధితురాలు ఫిర్యాదు మేరకు 376 417 420 506 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు
2018 నుండి ప్రేమ పేరుతో పరిచయమై పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి శారీరకంగా వాడుకున్నాడు అంటూ బాధితురాలు ఫిర్యాదు లో పేర్కొంది. అంతేకాకుండా చంద్రగుప్త కోసం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాను అంటూ కూడా బాధ్యతరాలు ఫిర్యాదు చేసింది.
వాలెంటైన్స్ డే రోజు నడిచిన ఈ హై డ్రామా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కాగా ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే
Also Read: Pineapple Benefits: రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ 4 వ్యాధులకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook