Cobra Snake: ధైర్య సాహసాలతో మనుమరాలిని కాపాడిన నాన్నమ్మ నాగుపాముకు బలి
Grand Mother Saves Grand Daughter Life From Cobra Snake: పాముకాటు నుంచి మనమరాలిని ధైర్య సాహసాలతో కాపాడిన నాన్నమ్మ చివరకి అదే పాముకాటుకు గురై కన్నుమూసింది. దీంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది.
Cobra Snake: మనవరాలితో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి దూరిన పాము నేరుగా మంచంపైకి ఎక్కింది. మంచంపై నిద్రిస్తున్న నాన్నమ్మ, మనమరాళ్లపై పాకుతూ వెళ్లింది. ఇది గమనించిన నాన్నమ్మ అదును చూసి పామును అరచేత్తో పట్టేసుకుంది. వెంటనే మనుమరాలును పక్కకు నెట్టేసి పామును బయటకు పంపించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో పాము ఆమెను కాటేసింది. పాముకాటుకు ఆమె ఆరోగ్యం విషమించి ఆస్పత్రిలో మృతి చెందింది. ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ప్రాణాలకు తెగించి తనను కాపాడిన నాన్నమ్మ బతకలేదని మనమరాలు కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
Also Read: Kallu Bar: తాగుబోతులకు రేవంత్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. మందు బార్ల మాదిరి కొత్తగా 'కల్లు బార్లు'
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లో సీతాదేవి (72) తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. రాత్రిపూట తన మనమరాలు (24)తో కలిసి మంచంపై నిద్రించింది. నిద్రపోతున్న సమయంలో అర్ధరాత్రి పాము ఇంట్లోకి వచ్చింది. దుప్పటి కప్పుకున్న వారిపై నుంచి మెల్లగా పాకుతూ వెళ్తున్న పామును సీతాదేవి గమనించింది. అయితే మనమరాలుకు జాగ్రత్తలు చెప్పి కదలకుండా ఉండమని సూచించింది. ఇద్దరు కదలకుండా అలాగే నిద్రపోయారు. అదును చూసి వెంటనే నాగుపామును చటుక్కున బామ్మ చేత్తో పట్టుకుంది. రెండు చేతులతో అదిమిపట్టుకుని నిలబడింది. పామును పట్టుకుని కేకలు వేయడంతో కుటుంబసభ్యులు వచ్చారు. అందరూ అప్రమత్తమై పామును జాగ్రత్తగా పట్టుకుని బయటకు పంపించారు.
Also Read: Leopard: ఎరక్కపోయి ఇరుక్కుపోయిన చిరుత పులి.. నీళ్లు తాగుతూ రాగి బిందెలోకి ఇరుక్కున్న పులి తల
అయితే ఈ పట్టుకున్న సమయంలో సీతాదేవిని పాము కాటేసింది. పామును తరలించాక ఆమె అస్వస్థతకు గురయ్యింది. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు సీతాదేవిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె శరీరమంతా విషం వ్యాపించడంతో పరిస్థితి విషమించి సీతాదేవి మరణించింది. తమ బిడ్డను కాపాడి బామ్మ మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బామ్మ మనమరాలి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిందని తెలిపారు. అయితే ఈ సంఘటన వార్త పోలీసులకు తెలియదు. పోలీసులకు తెలియకుండా మృతదేహానికి దహన సంస్కారాలు కుటుంబసభ్యులు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook