Gujarat Couple Uses Guillotine-like Device to Behead Self: టెక్నాలజీ ఎన్ని కొత్త పుంతలు తొక్కుతున్న ఇంకా మూఢనమ్మకాలను నమ్మే వారి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయాన్ని మూఢనమ్మకాలు అని కొట్టి పారేస్తున్న వారు ఎక్కువ అవుతుంటే మరోపక్క ప్రతి విషయాన్ని మూఢ నమ్మకాలతోనే చూసే వారు కూడా ఉంటున్నారు. తాజాగా గుజరాత్ లో ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. గుజరాత్ లోని రాజకోట్ కు చెందిన మొగుడు- పెళ్ళాలు మూడ విశ్వాసాలకు బలయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 క్షుద్ర పూజలు చేసిన భార్యాభర్తలు ఇద్దరు తమ తమ తలలను తామే నరుక్కుని బలి ఇచ్చుకోవడం గుజరాత్ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. గుజరాత్ లోని రాజకోట్ కు చెందిన హేము మక్వానా, హన్సా మక్వానా అనే దంపతులు వ్యవసాయం చేసుకుంటూ తమ కుటుంబాన్ని సాకుతున్నారు. ఇందులో హేము వయసు 38 సంవత్సరాలు కాగా హన్సా వయసు 35 సంవత్సరాలు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అందులో ఒకరి వయసు 14 ఏళ్ళు కాగా మరొకరి వయసు 13 ఏళ్లు. ఈ చిన్నారులు ఇద్దరు దగ్గరలో ఉన్న మేనమామ ఇంటికి వెళ్లి ఆదివారం అంతా అక్కడే గడిపి తిరిగి ఇంటికి వచ్చేసరికి తల్లిదండ్రులు ఇద్దరూ దారుణ స్థితిలో చనిపోయి కనిపించారు.


ఇదీ చదవండి: Chiranjeevi Gesture: మరోసారి మంచిమనసు చాటుకున్న చిరు..బలగం మొగిలయ్య 'కళ్ల'కి అండగా!


తమ తల్లిదండ్రులు ఇద్దరూ తలలు తెగిపోయి విగత జీవులుగా పడి ఉండడానికి చూసి వణికిపోయి వెంటనే స్థానికులకు తెలియజేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి అసలు ఎందుకు చనిపోయారు? అనే విషయాన్ని తేల్చే పనిలో పడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పూర్తిస్థాయిలో సోదాలు జరిగితే అక్కడ ఒక లేఖ లభ్యమైంది. ఆ లేఖను బట్టి వారిద్దరూ తమకు తామే తలలు నరుక్కుని చనిపోయారని నిర్ధారణకు వచ్చారు.


 ఇంట్లోనే పూజ నిర్వహించి కరెక్ట్ గా హోమగుండంలో తలలు తెగిపడే విధంగా ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సరిగ్గా అలా తలలు తెగి పడేందుకోసం ఒక పరికరాన్ని కూడా స్వయంగా డిజైన్ చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ ఇద్దరు భార్యాభర్తలకు ఆర్థిక సమస్యలు కానీ కుటుంబ తగాదాలు కానీ ఇతర సమస్యలు కానీ లేవని అక్కడ లభ్యమైన లేఖను బట్టి క్షుద్ర పూజ చేస్తూ అందులో భాగంగానే వారు తలలు నరుక్కున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


ఇదీ చదవండి: Trolls on Karuna Bhushan: తల్లిని అలా అంటే ఊరుకుంటావా? ఏం మెసేజ్ ఇద్దామని?..కరుణను ఒక రేంజ్లో ఆడుకుంటున్న నెటిజన్లు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook