Hanmakonda Road Accident News: హన్మకొండ జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హన్మకొండ - పస్రా రహదారి నెత్తురోడింది. ఆత్మకూరు - కటాక్షపూర్ మధ్యలో ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన టిప్పర్ కారును  ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, కారు డ్రైవర్ తో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను హన్మకొండ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది అని ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలిపారు. టిప్పర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కారులో ప్రయాణిస్తున్న వారంతా గ్రేటర్ వరంగల్ పరిధిలోని కాశీబుగ్గ వాసులుగా తెలుస్తోంది. ఇవాళ ఉదయమే వారు కాశీబుగ్గ నుంచి కారులో వరంగల్ జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారాలమ్మ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 


ఇది కూడా చదవండి : Cars Parking on Building : నో పార్కింగ్ ఛలాన్లు తప్పించుకునేందుకు కార్లను ఇల్లు ఇలా


టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. తీవ్ర గాయాలపాలైన వారు కారులో చిక్కుకుని అందులోనే ప్రాణాలు విడిచినట్లు స్థానికులు చెబుతున్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా నిత్యం ఒక ఘటన మరువక ముందే చోటుచేసుకుంటోన్న మరో రోడ్డు ప్రమాదం రోడ్డు భద్రతపై అనేక సనాళ్లు లేవనెత్తుతోంది. రోడ్డు భద్రత విషయంలో ఎన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చినా రోడ్డు ప్రమాదాలను నివారించలేకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. పాదచారుల నుంచి వాహనదారుల వరకు .. ఎవరైనా సరే ఇంట్లోంచి బయటికి వెళ్లిన వారు తిరిగి ఇంటికి చేరుకునే వరకు భద్రత కరువైంది.


ఇది కూడా చదవండి : Today Viral News: ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ తో జాగ్రత్త.. న్యూడ్‌ కాల్‌ చేస్తే వైరల్ చేసిన ఘనుడు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK