Indus Hospital Fire Accident in Vizag: విశాఖ నగరంలోని జగదాంబ కూడలి సమీపంలోని ఇండస్‌ హస్పిటల్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రిలోని ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న ఆపరేషన్ థియేటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆందోళన నెలకొంది. మిగిలిన అంతస్థులకు పొగలు వ్యాపించడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది.. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆసుపత్రిలో ఉన్న 40 మంది రోగులకు అంబులెన్స్‌లలో ఇతర హస్పిటల్స్‌కు తరలించారు. ఉదయం 11 గంటల సమయంలో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్‌ కారణంగా మంటలు రేగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణాపాయము లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అగ్నిప్రమాదంతో ఆసుపత్రిలో ఉన్న రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. పైఅంతస్తుల్లోని ఎమర్జెన్సీ వార్డుల్లో ఉన్న రోగులను నిచ్చెనల సాయంతో కిందకు తీసుకువచ్చారు. ప్రమాదస్థలానికి చేరుకున్న విశాఖ సీపీ రవి శంకర్.. పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. రోగులను వేరే ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. పొగలు దట్టంగా వ్యాపించడంతో గందరగోళం ఏర్పడిందన్నారు. ఎవరికీ గాయాలు అయినట్లు సమాచారం లేదని.. మొత్తం 12 ఫైర్‌ ఇంజిన్లు మంటలను అదుపు చేసినట్లు ఆయన చెప్పారు.


Also Read:  Ind-vs-SA: భారత్-దక్షిణాఫ్రికా చివరి టీ20 నేడే, సిరీస్ సమం అవుతుందా లేదా


Also Read: Vivo Y27 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo Y27 మొబైల్‌ కేవలం రూ.12,499కే..ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి