HYDRAA Death: హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య.. కూకట్‌పల్లిలో ఉద్రిక్తత
HYDRAA Fear Women Suicide: హైడ్రా బుల్డోజర్ల దూకుడుతో పేదల బతుకులు ఆగమవుతుండగా.. తాజాగా ఒకరి ప్రాణమే తీసింది. దీంతో హైదరాబాద్ ప్రజల్లో కలకలం రేపింది.
HYDRAA Demolish: అన్నంత పనే జరిగింది. హైడ్రా కూల్చివేతలతో పేదల గుండెలు పగులుతున్నాయి. తన ఇల్లు కూల్చేస్తారేమోననే భయంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. బుల్డోజర్ల భయంతో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. రోజంతా హైదరాబాద్ ప్రజలు హైడ్రాకు వ్యతిరేకంగా ధర్నాలు.. నిరసనలతో హోరెత్తించగా సాయంత్రం పూట భయంతో ఆమె ప్రాణం తీసుకుంది. ఈ సంఘటనతో హైదరాబాద్ ఉలిక్కిపడింది. నగర ప్రజల్లో అలజడి మొదలైంది.
Also Read: Tragedy Incidents: తెలంగాణలో ఆత్మహత్యల ఘోష.. పలు కారణాలతో ముగ్గురు బలవన్మరణం
కూకట్‌పల్లి రామాలయం సమీపంలోని యాదవ బస్తీలో గుర్రంపల్లి బుచ్చమ్మ (56), శివయ్య దంపతులు నివసిస్తున్నారు. వారికి ముగ్గురు కూతుళ్లు కాగా వారికి పెళ్లి చేసి మూడు ఇండ్లు ఇచ్చారు. అయితే కొద్ది రోజుల కిందట నల్ల చెరువు వద్ద హైడ్రా అధికారులు సర్వే చేపట్టారు. అధికారుల హడావుడి చేపట్టడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. దీనికి తోడు హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు ఆమెను కలవరపర్చింది. ఇటీవల కూల్చివేతలలో భాగంగా ఇండ్లు ఖాళీ చేయాయని హైడ్రా అధికారులు హెచ్చరించారు.
Also Read: Flipkart Apologise: పురుషులను కించపరిచిన ఫ్లిప్‌కార్ట్.. నెటిజన్ల దెబ్బకు దిగివచ్చి క్షమాపణలు
ఈ నేపథ్యంలో తన బిడ్డలకు ఇచ్చిన ఇండ్లు కూలిపోతాయన బుచ్చమ్మ కొన్ని రోజుల నుంచి ఆందోళన చెందుతోంది. మనస్తాపానికి లోనయిన బుచ్చమ్మ శుక్రవారం సాయంత్రం తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడింది. ఇంటి కిటికి గ్రిల్స్‌కు తాడుతో ఉరేసుకుని చనిపోయింది. ఆలస్యంగా గమనించిన కుటుంబసభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే తాడు విప్పి పరిశీలించగా అప్పటికే ఆమె చనిపోయింది.
స్థానికంగా ఉద్రిక్తత
హైడ్రా ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న నల్లచెరువు పరిధిలో పలు ఇండ్లు, షెడ్లను అధికారులు కూల్చివేస్తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఒకరు ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా కలకలం రేపింది. ఆమె ఆత్మహత్యతో స్థానికులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబాన్ని వివిధ పార్టీల నాయకులు పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.