One Day Three Lifes End: స్నేహితులు నమ్మించి మోసం చేశారని ఓ యువకుడు.. భర్తతో భేదాభిప్రాయాలతో సంసారం సాఫీగా జరగడం లేదని ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. చదువు ఇతర కారణాలతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి తమ ప్రాణాలను తీసుకున్నారు. పలు కారణాలతో ఒకే రోజు ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడడంతో తెలంగాణలో తీవ్ర విషాదం ఏర్పడింది. బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగాయి. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులు చేపట్టారు. రాష్ట్రంలో జరిగిన ఈ విషాద సంఘటనల వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు చెప్పిన వివరాల ప్రకారం..
Also Read: Flipkart Apologise: పురుషులను కించపరిచిన ఫ్లిప్‌కార్ట్.. నెటిజన్ల దెబ్బకు దిగివచ్చి క్షమాపణలు
కుటుంబ తగదాలతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
భర్తతో గొడవలు.. కుటుంబ తగాదాలతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. మియాపూర్‌లోని మయూరి నగర్‌లోని దివ్య శక్తి అపార్ట్మెంట్‌మెంట్‌లో నివసించే సాయి సింధూర (29) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. ఆమెకు భర్త, బాబు ఉన్నారు. అయితే కొంతకాలంగా అనారోగ్య సమస్యతో పాటు భర్తతో విభేదాలు ఏర్పడడంతో సింధూర ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం తాము నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లోని 9వ అంతస్తుపైకి చేరుకుని కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో ఘటన స్థలంలోనే ఆమె మృతి చెందారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Friends Stabbed: ప్రాణం తీసిన 'మొబైల్ ఫోన్' పార్టీ.. దావత్ ఇవ్వలేదని తోటి స్నేహితులే
స్నేహితుల మోసం
భూమి విషయంలో నమ్మిన తన స్నేహితులే మోసం చేశారని ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కూకట్‌పల్లిలోని ప్రగతి నగర్‌లో చోటుచేసుకుంది. ప్రగతినగర్‌లోని గోకుల్‌ఫ్లాట్స్‌లో రాజేశ్ (32) భార్య, పాపతో నివసించేవాడు. ఐటీ కన్సల్టెంట్‌గా పని చేస్తూ హాయిగా జీవిస్తున్న అతడికి నమ్మిన స్నేహితులే మోసం చేశారు. ఈ కారణంతో చెరువులో శుక్రవారం దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ సందర్భంగా తన స్నేహితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'నా స్నేహితులు బొంతల వినయ్, కొత్తపల్లి శ్రీనివాస్ వలనే నేను ఆత్మహత్ చేసుకుంటున్నా. భూమి విషయంలో నన్ను మోసం చేశారు' అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని అతడి భార్యకు పంపాడు. ఆందోళన చెందిన ఆమె కుటుంబసభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లొకేషన్ ఆధారంగా గుర్తించిన కేపీహెచ్‌బీ పోలీసులు చెరువులో మృతదేహాన్ని వెలికితీశారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన కేపి.హెచ్.బీ పోలీసులు.
గీతం విశ్వవిద్యాలయంలో..
సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామంలోని గీతం విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డింది. చదువుపై ఇష్టం లేక.. ఇతర కారణాలతో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం. సీఎస్‌ఈ కంప్యూటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న వర్ష (22) శుక్రవారం వసతిగృహంలోనే ఉంది. వసతిగృహంలోని గదిలో గడియ పెట్టుకుని ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయింది. అయితే ఎంతకీ వర్ష బయటకు రాకపోవడంతో వార్డెన్, సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వచ్చి చూడగా వర్ష మృతి చెంది ఉంది. వర్సిటీ యజమాన్యానికి విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.