Nafe Singh Rathee: రోడ్డుపై ప్రయాణిస్తున్న మాజీ ఎమ్మెల్యే కారును కొందరు దుండగులు అడ్డగించి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ముగ్గురిని పొట్టన బెట్టుకున్నారు. ఈ సంఘటనతో హర్యానాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. చనిపోయింది ఎవరో కాదు ఇండియన్‌ నేషనల్‌ లోక్‌ దల్‌ (ఐఎన్‌ఎల్‌డీ) అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్‌ రాథీ. అతడితోపాటు మరో ఇద్దరు మృతి చెందారు. పట్టపగలు నడిరోడ్డు మీద దారుణ హత్య జరగడంతో అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Depression: యూట్యూబర్‌ షణ్ముఖ్‌ చనిపోవాలనుకున్నాడా? మానసిక వ్యధకు గురయ్యాడా?


హర్యానా ఝజ్జర్‌ జిల్లాలోని బహదూర్‌గడ్‌లో బుధవారం మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్‌ రాథీ పర్యటించారు. బరాహి గేడట్‌ సమీపంలోకి రాగానే కొందరు దుండగులు ఐ10 కారులో దూసుకొచ్చారు. నఫే సింగ్‌ కారును అడ్డగించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. కొన్ని రౌండ్లు కాల్పులు జరపడంతో కారులోని వారు బయటకు రాలేక అందులోనే ఉండిపోయారు. బుల్లెట్ల వర్షానికి కారులోని నఫే సింగ్‌తోపాటు కారు డ్రైవర్‌, మరో వ్యక్తి మృతి చెందారు. వాళ్లు చనిపోయారని నిర్ధారించుకున్న అనంతరం దుండగులు పరారయ్యారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read: DJ Sound: డీజే శబ్ధానికి గుండె పగిలింది.. విషాదం నింపిన 'అమ్మవారి ఊరేగింపు'


సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నఫే సింగ్‌ దేహంలోకి బుల్లెట్లు చొచ్చుకొని వెళ్లాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు ఎవరు అనేది ఆరా తీస్తున్నారు. ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? దీని వెనకాల కారణాలేమిటనేది పోలీసులు అన్వేషణ మొదలుపెట్టారు. కాగా స్థానికంగా సీసీ కెమెరాల ఫుటేజీలు పోలీసులు పరిశీలిస్తున్నారు.




బహదూర్‌గడ్‌ నియోజకవర్గం నుంచి నఫే సింగ్‌ రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కొన్ని రోజుల నుంచి అతడికి బెదిరింపులు వస్తున్నాయి. అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ దారుణం చోటుచేసుకుందని కుటుంబసభ్యులు, ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ దారుణ సంఘటనపై మాజీ ముఖ్యమంత్రి భూపీందర్‌ సింగ్‌ హుడా ఖండించారు. 'ఈ సంఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం. పట్టపగలు ఈ దారుణం చోటుచేసుకున్నదంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. శాంతిభద్రతలు క్షీణించాయని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఈ రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదు' అని విమర్శించారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook