DJ Sound: డీజే శబ్ధానికి గుండె పగిలింది.. విషాదం నింపిన 'అమ్మవారి ఊరేగింపు'

Man Dies With DJ Sound: భారీ శబ్ధాలకు తోడు ఊఫర్లతో జనాల చెవులు చిళ్లుమంటాయి. ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోకుండా ఊరేగింపులు నిర్వహిస్తుండడంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయి. తాజాగా ఓ వృద్ధుడు డీజే శబ్ధానికి తాళలేక మృతిచెందాడు. ఊరేగింపు కాస్త విషాదాంతంగా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 24, 2024, 09:37 PM IST
DJ Sound: డీజే శబ్ధానికి గుండె పగిలింది.. విషాదం నింపిన 'అమ్మవారి ఊరేగింపు'

DJ Sound Procession: అమ్మవారి విగ్రహం నిమజ్జనం సందర్భంగా భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బాక్స్‌లు ఏర్పాటుచేసి భారీ శబ్ధాలతో డీజే మోగించారు. దీనికితోడు పెద్ద పెద్ద శబ్ధాలు వచ్చే టపాసులు కూడా పేల్చారు. వీటితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ శబ్ధాలకు తాళలేక ఓ వృద్ధుడు గుండెపోటుకు గురయ్యి అక్కడికక్కడే కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు గుర్తించారు. అమ్మవారి ఊరేగింపు కాస్త విషాదాంతంగా మిగిలింది. ఈ సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

Also Read: Gun Shot: మా అమ్మ, అక్కనే వేధిస్తారా? పోకిరీల తుపాకీ గుళ్లకు ఎదురునిలబడ్డ బాలుడు

రూర్కెలా పట్టణంలో కొందరు యువకులు ఈనెల 23వ తేదీన (శుక్రవారం) సరస్వతీ అమ్మవారి విగ్రహం నిమజ్జనం సందర్భంగా యాత్ర నిర్వహించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న యువకులు అమ్మవారి ఆనందోత్సాహాల మధ్య ఊరేగించారు. ఈ సందర్భంగా భారీ శబ్ధాలు వచ్చే టపాసులు పేల్చారు. దీనికితోడు పెద్ద పెద్ద సౌండ్‌ బాక్స్‌లలో డీజే పాటలు పెట్టి ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు. విపరీతమైన శబ్ధంతో యువత ఉత్సాహంగా ఉత్సవంలో పాల్గొంటే.. స్థానికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Also Read: Leopard Killed: ఇంట్లోకి దూరిన పులి.. కర్కశత్వంతో బూట్లతో తన్ని చంపేసిన అధికారులు

అక్కడే చాయ్‌ దుకాణం నిర్వహించే ప్రేమ్‌నాథ్‌ బరభయ (50) ఈ శబ్ధాలను తట్టుకోలేకపోయాడు. డీజేలకు పెట్టిన ఊఫర్లతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చెవులు చిల్లుమనేలా ఉండే శబ్ధాలకు తాళలేక అతడు గుండెపోటుకు గురయ్యాడు. గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే ప్రేమ్‌నాథ్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందాడని రూర్కెలా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఈ సంఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు వైద్యులు అప్పగించారు. అతడి మరణానికి ఊరేగింపే కారణమని గుర్తించిన స్థానికులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వెంటనే స్థానిక రఘునాథ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని స్థానికులు ఆందోళన చేపట్టారు. ఊరేగింపు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఊరేగింపులకు అనుమతులు ఎలా ఇచ్చారని నిలదీశారు. భారీ భారీ శబ్ధాలతో వృద్ధులు ఉండలేని పరిస్థితి అని వాపోయారు. వెంటనే ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక డీజేలను నిషేధించాలని డిమాండ్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News