Jammu And Kashmir Accident Latest Updates: జమ్మూ కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బుధవారం చీనాబ్ నదిలో లోయలో పడటంతో దాదాపు 30 మంది మరణించారు. చాలామంది గాయపడ్డారు. జమ్మూలోని దోడాలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. కిష్త్వార్ నుంచి జమ్మూ వెళ్తున్న బస్సు  అసర్ ప్రాంతం సమీపంలో 250 మీటర్ల లోతైన లోయలో పడిపోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాలను వెలికితీశారు. బస్సు లోయలో పడిపోయిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్షతగాత్రులను తరలించేందుకు హెలికాప్టర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. గాయపడిన వారిని అవసరాన్ని బట్టి జిల్లా ఆసుపత్రి కిష్త్వార్, జీఎమ్‌సీ దోడాకు తరలిస్తున్నట్లు చెప్పారు. తీవ్రంగా గాయపడిన వారిని తరలించడానికి హెలికాప్టర్‌ను ఏర్పాటు చేస్తున్నామని.. అన్ని రకాలుగా చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. 


రోడ్డు ప్రమాదంపై జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందించారు. మృతుల కుటుంబాలకు తీవ్రసంతాపం తెలిపారు. "దోడాలోని అస్సార్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం గురించి తెలిసింది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ప్రభుత్వ పరంగా రెస్క్యూ కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నారని ఆశిస్తున్నాను" అని ఆమె ట్వీట్ చేశారు.


Also Read: IND Vs NZ Live Updates: రోహిత్ శర్మ సిక్సర్ల వర్షం.. టీమిండియాకు మెరుపు ఆరంభం  


Also Read: LPG Gas Cylinder Price: ఎల్పీజీ గ్యాస్ సిలెండర్‌పై భారీ తగ్గింపు, అక్కడ సగం ధరకే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook