Tribal Woman Tortured by Jharkhand BJP Leader: జార్ఖండ్ బీజేపీ మహిళ నేత సీమా పాత్ర ఓ గిరిజన మహిళ పట్ల అమానుషంగా వ్యవహరించారు. తన ఇంట్లో పనిచేసే సునీత అనే మహిళను తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. ఆఖరికి ఆమె నాలుకతో టాయిలెట్ క్లీన్ చేయించారు. గత ఎనిమిదేళ్లుగా సీమా సునీతను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు తేలింది. సీమా పాత్ర అమానుషత్వం వెలుగుచూడటంతో బీజేపీ ఆమెపై వేటు వేసింది. పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీమా పాత్ర మాజీ ఐఏఎస్ అధికారి మహేశ్వర్ పాత్ర భార్య. సునీత అనే గిరిజన మహిళ ఆమె ఇంట్లో చాలా ఏళ్లుగా పనిచేస్తోంది. సీమా పాత్ర కొడుకు ఆయుష్మాన్ తన తల్లి సునీతను పెడుతున్న చిత్రహింసలు చూడలేకపోయాడు. తల్లి అమానుషత్వాన్ని తన స్నేహితుడు వివేక్ బస్కేతో చెప్పాడు. ఎట్టకేలకు వివేక్ బస్కే సాయంతో సునీత సీమా పాత్ర చిత్రహింసల నుంచి బయటపడింది.


సీమా పాత్రపై సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాంచీ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. సీమాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అదే సమయంలో బీజేపీ ఆమెపై వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. 


సీమా పాత్ర ఒళ్లంతా కాల్చిన గాయాలున్నాయి. వేడి వస్తువులతో ఆమె తన ఒంటిపై కాల్చేదని బాధితురాలు సునీత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించింది. సీమా పాత్రను అరెస్ట్ చేసిన కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ  జార్ఖండ్ డీజీపీకి లేఖ రాశారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. అలాగే, బాధితురాలికి తగిన వైద్య సాయం అందేలా చూడాలని కోరారు.


Also Read: Ganesh Chaturthi 2022: గణేశ్ చతుర్థి నాడు ఇంట్లో ఎలుక కనిపిస్తే శుభమా ? అశుభమా ?


Also Read: Horoscope Today August 31st 2022: వినాయక చవితి స్పెషల్.. నేటి రాశి ఫలాల్లో ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందంటే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook