Jharkhand Murder Case: పెళ్లైన పది రోజులకే దారుణం.. శ్రద్ధా హత్య తరహాలోనే జార్ఖండ్‌లో ఘోరం
Sahibganj Murder Case: ఢిల్లీలో శ్రద్దా హత్య కేసు తరువాత దేశవ్యాప్తంగా అలాంటి సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జార్ఖండ్‌లో ఓ దుర్మార్గుడు తన భార్యను హత్య చేసి.. 12 ముక్కలుగా నరికాడు. పెళ్లైన పది రోజులకే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
Sahibganj Murder Case: జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీకి చెందిన శ్రద్ధా హత్య కేసు లాంటి మరో ఘటన సాహిబ్‌గంజ్‌లో చోటుచేసుకుంది. దిల్దార్ అన్సారీ అనే వ్యక్తి తన భార్యను హత్య చేసినట్లు తెలుస్తోంది. తన రెండో భార్యను దారుణంగా హత్య చేసి.. మృతదేహాన్ని 12 ముక్కలుగా చేసి పడేశాడు. నిందితుడు దిల్దార్ అన్సారీని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మృతురాలిని గిరిజన సమాజానికి రబితా పహాడిన్‌గా పోలీసులు గుర్తించారు. దిల్దార్ అన్సారీ 10-15 రోజుల క్రితం రబితను రెండో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య కొన్నాళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. శుక్రవారం రాత్రి ఈ దారుణ హత్యకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు.
శనివారం సాయంత్రం బోరియో సంతాలీ ప్రాంతంలోని అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణంలో ఉన్న భవనం వెనుక నుంచి ఓ మనిషి కాలు ఉందని పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని విచారించిన పోలీసులు.. పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. ఆ తర్వాత నిందితుడు దిల్దార్ అన్సారీ బంధువులందరి స్థలాల్లో దాడులు నిర్వహించారు. నిందితుడు మేనమామ మొయినుల్ అన్సారీ ఇంటి నుంచి హత్యకు ఉపయోగించిన రెండు పదునైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
22 ఏళ్ల మహిళ మృతదేహానికి సంబంధించి 12 ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు సాహిబ్‌గంజ్ ఎస్పీ తెలిపారు. శరీరంలోని కొన్ని భాగాలు ఇంకా లభ్యం కాలేదన్నారు. మిగిలిన భాగాల కోసం వెతుకున్నామని చెప్పారు. మృతురాలి భర్త దిల్దార్ అన్సారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించారు.
ఇటీవలె ఢిల్లీలోని శ్రద్దా వాకర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేకిత్తించిన విషయం తెలిసిందే. శ్రద్ధాను కూడా యువకుడు 35 ముక్కలుగా కట్ చేసి వివిధ ప్రాంతాల్లో విసిరేశాడు. ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉండగానే.. దేశంలో ఇలాంటి ఘటనలు మరిన్ని వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా జార్ఖండ్‌లో జరిగిన హత్య కలకలం రేపుతోంది.
Also Read: India Vs Bangladesh 1st Test: తొలి టెస్టులో బంగ్లా చిత్తు.. టీమిండియా గ్రాండ్ విక్టరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook