Lord Hanuman Idol Burnt: కాకినాడ నగరం అచ్యుతాపురం రైల్వే గెట్ సమీపంలో ఉన్న రాములు వారి ఆలయం బయట ఉన్న ఆంజనేయు స్వామి విగ్రహంపై ఒక గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ పోసి మంట పెట్టడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనపై స్థానిక విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, హిందూ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. అయితే మద్యం మత్తులో హనుమంతుడికి నిప్పు పెట్టిన ఆగంతుకుడిని అదే సమయంలో పట్టుకున్న స్థానికులు.. అతడిని మందలించి వదిలేశారు. హన్మంతుడి విగ్రహంపై మంటలను ఆర్పేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఘటనపై సోషల్ మీడియాలో, స్థానిక వాట్సాప్ గ్రూపులలో అనేక వదంతులు వైరల్ అవుతున్న నేపథ్యంలో కాకినాడలో ఒకింత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో శనివారం ఉదయం ఈ విషయం తెలుసుకున్న కాకినాడ రెండో పట్టణ పోలీసులు.. ఘటనా ప్రదేశానికి వెళ్ళి విచారణ చేపట్టారు. స్థానిక సీఐతో కలిసి దర్యాప్తు చేపట్టిన డీఎస్పీ మురళీ కృష్ణా రెడ్డి.. కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.


ప్రాథమిక దర్యాప్తులో తేలిన అంశాల ప్రకారం కూరాకుల శ్రీనివాస్ అనే వ్యక్తి అదే ప్రాంతంలో తరచుగా మద్యం సేవించి, బాద్యాతారాహిత్యంగా తిరుగుతుంటాడని.. మతిస్థిమితం లేని ఆ వ్యక్తే శుక్రవారం రాత్రి ఈ దురాగతానికి పాల్పడినట్టు తేలిందని డిఎస్పీ తెలిపారు. మతిస్థిమితం లేని ఆ వ్యక్తి శుక్రవారం అర్ధరాత్రి సదరు ఆంజనేయ స్వామి విగ్రహం వద్దకు వెళ్లి.. ఆంజనేయ స్వామిని ఉద్దేశించి మాట్లాడుతూ.. "నువ్వు డబ్బు సంపాదించుకున్నావు, నాకెందుకు ఇవ్వవు" అంటూ విగ్రహానికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నం చేసినట్టు తేలిందని అన్నారు. 


అతడిని స్థానికులు ప్రశ్నించగా.. తాగిన మత్తులో చేశాను క్షమించమని కోరాడని.. అందువల్లే వాళ్లు అతడిని మందలించి వదిలేశారని డిఎస్పీ పేర్కొన్నారు. శనివారం ఉదయం ఈ విషయం తెలిసిన వెంటనే అతన్ని వెదికి పట్టుకొని అదుపులో తీసుకొని విచారిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో స్థానిక పోలీసులు చాలా వేగంగా స్పందించి అతని అదుపులో తీసుకున్నారు. ఈ విషయంపై సంబంధిత దేవాలయం కమిటీ నుంచి ఫిర్యాదు తీసుకొని వెంటనే కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిఎస్పీ స్పష్టంచేశారు. అప్పటివరకు ఈ విషయంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలాగా, మనోభావాలను దెబ్బతీసేలా వివిధ రకాల వదంతులు వ్యాపింప చేయవద్దని, కాకినాడలో శాంతి భద్రతలకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని డిఎస్పీ విజ్ఞప్తి చేశారు. మొత్తానికి పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది.


ఇది కూడా చదవండి : India BF7 Variant: కొవిడ్ కొత్త వేరియంట్‌పై కేంద్రం అలెర్ట్.. నేటి నుంచి విదేశీ ప్రయాణికులకు కరోనా టెస్టులు!


ఇది కూడా చదవండి : Free Ration Scheme: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. 2023 డిసెంబర్ వరకు ఉచిత బియ్యం


ఇది కూడా చదవండి : India's COVID Cases: దేశవ్యాప్తంగా మంగళవారం నుంచి ఎమర్జెన్సీ మాక్‌డ్రిల్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook