Oyo Room Hotel: ఓయో రూమ్‌లో ప్రేమ జంటకు భారీ షాక్.. గదిలో సీక్రెట్ కెమెరాలు
Love Couple Shocked In Oyo Room CC Camera Found In Hotel Room: ప్రశాంతంగా.. ఏకాంతంగా గడిపేందుకు ఓయో రూమ్‌కు వెళ్లే జంటలు ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే. గదుల్లో రహాస్య కెమెరాలు ఉండే అవకాశం ఉంది.
Love Couple Shocked In Oyo Room: ఏకాంతంగా గడిపేందుకు ఓయో రూమ్‌కు రాగా దిగ్భ్రాంతి కలిగించే సంఘటన చోటుచేసుకుంది. జంట రహాస్య వీడియోలు చిత్రీకరిస్తూ హోటల్ నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. జంటలు ఏకాంతంగా ఉన్న సమయంలో వాటిని రహాస్య కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు. ఆ జంటలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం.. లేకపోతే ఆ యువతిని లోబర్చుకోవడం వంటివి చేస్తున్నారు. అలాంటి ముఠాను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ శివారు శంషాబాద్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Kavitha Released: 164 రోజులకు బయటి లోకాన్ని చూసిన కవిత.. తిహార్ జైలు నుంచి విడుదల
శంషాబాద్‌లో ఒక హోటల్ నిర్వాహకులు ఓయో రూమ్‌ను నిర్వహిస్తున్నారు. ఏకాంతంగా గడిపేందుకు ఓయో రూమ్‌లు సురక్షితమని నమ్మి జంటలు ఇక్కడకు వస్తున్నాయి. అయితే హోటల్ నిర్వాహకులు ఎవరికీ అనుమానం రాకుండా గదుల్లో రహాస్య కెమెరాలను ఉంచారు. జంటలు ఏకాంతంగా గడుపుతున్న వీడియోలను రహాస్య కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. అయితే చిత్రీకరించిన వీడియోలను తీసుకుని అదే జంటలను బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే కొందరు జంటలు భయపడి హోటల్ నిర్వాహకులు అడిగిన మొత్తం ఇచ్చుకుంటున్నారు. అయితే కొందరు బాధితులు మాత్రం హోటల్ నిర్వాహకులపై పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Also Read: Ban Work From Home: హైదరాబాద్‌లో విచిత్ర డిమాండ్.. వర్క్ ఫ్రమ్ హోమ్ తొలగించాలని ధర్నా
బాధితుల సమాచారం మేరకు పోలీసులు హోటల్‌పై దాడులు నిర్వహించగా ఓయో గదుల్లో సీసీ కెమెరాలు లభించాయి. గది అద్దెకు తీసుకున్న వ్యక్తుల ఏకాంత వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడడం చూసి పోలీసులు విస్తుపోయారు. వెంటనే సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. హోటల్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆ సీసీ కెమెరాల్లో చాలా మంది జంటల వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఓయ్ రూమ్‌కు వచ్చిన జంటలు ఆందోళన చెందుతున్నాయి. తమ వీడియోలు ఎక్కడా బయట పడతాయోనని కంగారు పడుతున్నారు. ఈ సందర్భంగా కొన్ని జంటలు రహాస్యంగా పోలీసులను కలిసి తమ వీడియోలు ఉంటే డిలీట్ చేయమని కోరుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter