Woman Death in MP: తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ మహిళను భార్య హత్య చేసిన ఘటన సంచలనం రేకిత్తిస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జబల్‌పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పటాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 రోజుల క్రితం గుర్తుతెలియని మహిళ మృతదేహాం లభ్యమవ్వగా.. పోలీసులు కేసును ఛేదించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో నిందితురాలు మహిళను గొంతునులిమి హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నెల 23వ తేదీన పటాన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని శోభా యాదవ్‌ కళాశాల రోడ్డులోని పొదల్లో మహిళ (30)మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టగా.. మృతురాలు పౌరి ఖుర్ద్ గ్రామానికి చెందిన ప్రీతి బర్మన్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలించగా.. గొంతు నులమడంతో ఊపిరి ఆడక చనిపోయినట్లు రిపోర్ట్‌లో వెల్లడయింది. పోలీసులు సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


మృతురాలు ప్రీతి బర్మన్‌కు దల్పత్‌పూర్ గ్రామానికి చెందిన హరిఓమ్ బర్మన్‌తో 9 ఏళ్ల క్రితం వివాహమైందని తేలింది. అయితే మూడేళ్లుగా భోలు బర్మన్‌ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. ప్రీతితో భోలు ఫోన్‌లో మాట్లాడడం.. అప్పుడప్పుడు ఆమెను కలవడం అతని భార్య ఉమాబాయి పసిగట్టింది. వీరిద్దరి వ్యవహారంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా భోలు బర్మన్ ప్రేమవ్యవహారం కొనసాగించడం ఆమెకు నచ్చలేదు. 


తన భర్తతో కలిసి తిరుగుతున్న ప్రీతిని ఉమా చూసి కోపోద్రిక్తురాలైంది. ఎలాగైనా ఆమెను హత్య చేయాలని ప్లాన్ వేసింది. ఈ నెల 23న ఆధార్ కార్డు ఇప్పిస్తాననే నెపంతో ప్రీతి బర్మన్‌ను పౌరీ ఖుర్ద్‌ గ్రామం నుంచి పటాన్‌ బస్టాండ్‌కు తీసుకొచ్చింది. ఆ తరువాత ఇద్దరు కాలేజీ రోడ్డులో కూర్చొని ఉండగా.. ప్రీతి మొబైల్‌లో ఎవరితోనో మాట్లాడుతోంది. ఇదే అదనుగా భావించిన ఉమా బాయి.. కండువా తీసుకుని ప్రీతి మెడకు బిగించి హత్య చేసింది. హత్య అనంతరం మృతురాలి బ్యాగ్‌ని ఇంటికి తీసుకెళ్లింది. మొబైల్‌ను డ్రైన్‌లో పడేసింది. 


అనుమానంతో ఉమా బాయిను పోలీసులు విచారించగా.. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో లోతుగా విచారణ చేపట్టగా.. హత్య చేసినట్లు ఒప్పుకుంది. ఆమెను అరెస్ట్ చేసి మృతురాలి మొబైల్, బ్యాగ్, బట్టలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు ఉమా బాయిని రిమాండ్‌కు తరలించారు. 


Also Read: Palnadu Murder Case: కుమారుడి తల నరికిన తండ్రి.. ఊరంతా తిరుగుతూ హల్‌చల్  


Also Read: GT vs MI Highlights: నెట్‌ బౌలర్‌ టు మ్యాచ్ విన్నర్.. మోహిత్ శర్మ వాట్ ఏ బౌలింగ్   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి