Vijay Devarakonda Defamation Case: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో పైకి వచ్చిన కొద్ది మంది హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంటి సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్లు వేసిన విజయ్ పెళ్లిచూపులు సినిమాతో పాపులర్ హీరో అయిపోయాడు. ఇక అర్జున్ రెడ్డి విజయ్ స్టేటస్ ను టాలీవుడ్ లో మార్చేసింది. ఇక అప్పటినుంచి రౌడీ హీరోగా పేరుగాంచిన విజయ్ దేవరకొండపై కొన్ని రూమర్స్ మనం సోషల్ మీడియాలో తరచూ వింటూనే ఉంటాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అందులో ముఖ్యంగా విజయ్ దేవరకొండ రష్మిక మందాన ప్రేమలో ఉన్నారని వీరి ప్రేమ గురించి ఎన్నో పుకార్లు షికార్లు కొడుతూ ఉంటాయి. అయితే ఇక్కడి వరకు సరే కానీ.. ఒక వ్యక్తి మాత్రం విజయ్ పైన అసభ్యకర వార్తను ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దాంతో ఆ వ్యక్తిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాల్సి వచ్చింది.


అసలు విషయానికి వస్తే అనంతపురంకు చెందిన వెంకట కిరణ్ అనే వ్యక్తి కొన్ని రోజుల క్రితం విజయ దేవరకొండ సినిమాలకు సంబంధించి అసభ్యకర వార్తలను ప్రసారం చేశాడు. సినీ పోలీస్ అనే యూట్యూబ్ ఛానల్ వేదికగా ఆ వ్యక్తి విజయ్ దేవరకొండ ను అవమానిస్తూ అసత్యపు వార్తను ప్రసారం చెయ్యడం కొనసాగించారు. విజయ్ దేవరకొండ గౌరవాన్ని కించపరిచే విధంగా,  అలానే ఆయన సినిమాలలోని హీరోయిన్ లను అవమానిస్తూ ఉండే విధంగా ఈ వార్తలు ఉండడం గమనర్హం. కాగా ఇలాంటి ప్రచారాలు కలిగి ఉన్న ఈ యూట్యూబ్ వీడియో లను పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి సదరు వ్యక్తి ఆచూకీని తెలుసుకున్నారు.


ఇక దాంతో కేసు నెంబర్: 2590/2023 గా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఇక కొన్ని గంటల వ్యవధిలోనే సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ వీడియోలనీ, అలానే ఆ యూట్యూబ్ ఛానల్ ని డిలీట్ చేయించారు. అంతేకాదు భవిష్యత్ లో ఇలాంటివి చేయకుండా ఉండే విధంగా చర్యలు కూడా చేపట్టారు పోలీసులు. ఇది మాత్రమే కాదు టార్గెటెడ్ గా ఎవరు వ్యాఖ్యలు చేసినా, మీడియా మాధ్యమాలలో అవమానిస్తున్నట్లు వార్తలు ప్రసారం చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


మరి ఇప్పటికైనా ఇలా సినిమా తారలపైన వచ్చే అసత్యపు ప్రచారాలు ఆగుతాయో లేదో చూడాలి.


Also Read:  Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా


Also Read:  Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు


 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి