Bus Accident In Manipur: మణిపూర్‌లోని నోనీ జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తంబలను హయ్యర్ సెకండరీ స్కూల్ బస్సు బోల్తా పడడంతో ఏడుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 40 మంది గాయపడ్డారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు 55 కిలోమీటర్ల దూరంలో కొండ జిల్లాలోని లాంగ్‌సాయి ప్రాంతానికి సమీపంలోని ఓల్డ్ కాచర్ రోడ్‌లో ఈ ప్రమాదం జరిగింది. పాఠశాల విద్యార్థులు రెండు బస్సుల్లో నోనీ జిల్లాలోని ఖౌపుమ్‌కు వార్షిక పాఠశాల అధ్యయన పర్యటనకు వెళ్లారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను రాజధాని ఇంఫాల్‌లోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థినులు ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడిందని చెప్పారు. 


ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు బోల్తా పడిన తర్వాత ఘటనా స్థలంలో విద్యార్థుల అరుపులు వినిపించాయి. మణిపూర్‌లోని నోని జిల్లాలో బిష్ణుపూర్-ఖౌపుమ్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. బస్సు స్టడీ టూర్ కోసం ఖౌపుమ్ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.


రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా..


బస్సు ప్రమాద ఘటనపై మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరెన్ సింగ్ స్పందించారు. ట్విటర్‌లో బస్సు ప్రమాదానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. 'ఈరోజు ఓల్డ్ కాచర్ రోడ్‌లో పాఠశాల పిల్లలను తీసుకెళ్తున్న బస్సు ప్రమాదం గురించి విని చాలా బాధపడ్డాను. ఘటనాస్థలికి చేరుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్‌, వైద్యబృందం, స్థానిక ఎమ్మెల్యే సహాయక చర్యలను సమన్వయం చేశారు. గాయపడిన వారు కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను..' అని ఆయన అన్నారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు సీఎం ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.


 



Also Read: Bank Holidays in January 2023: బ్యాంక్ వినియోగదారులకు అలర్ట్.. జనవరిలో సెలవులు ఇవే..   


Also Read: KL Rahul: టీమిండియాకు ఎదురుదెబ్బ.. కేఎల్ రాహుల్‌కు గాయం  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook