Karnataka Road Accident Latest Updates: కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ పట్టణం శివార్లలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో ఢీకొనడంతో 12 మంతి దుర్మరణం చెందారు. ఈ సంఘటన 44వ జాతీయ రహదారిపై చిక్‌బళ్లాపూర్‌ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు పక్కన ట్యాంకర్‌ను కారు డ్రైవర్ గమనించకపోవడంతో  ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మృతులంతా ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. వీరు బాగేపల్లి నుంచి చిక్కబళ్లాపూర్‌కు వెళ్తున్నట్లు బాగేపల్లి ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో టాటా సుమోలో 14 మంది ఉన్నట్లు సమాచారం. 12 మంది మరణించగా.. ఒకరు గాయపడ్డారు.


ప్రమాదంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడగా.. ప్రమదానికి గురైన టాటా సుమోను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు. పండుగ కోసం ఊరికి వచ్చిన కూలీలు.. తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా ప్రమాదం సంభవించడంతో ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారంతా బెంగళూరులో కూలి పనులకు వెళ్లే కూలీలుగా తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  


కర్ణాటక రోడ్డు ప్రమాదంపై సీఎం జగన్ స‌్పందించారు. "కర్ణాట‌క‌లోని చిక్‌బ‌ళ్ళాపూర్ వ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో స‌త్యసాయి జిల్లాకు చెందిన ప్రయాణికులు దుర్మ‌ర‌ణం చెంద‌డం ఎంతో క‌లచివేసింది. మృతిచెందిన వారి ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్నాను. బాధిత కుటుంబాల‌కు మ‌న ప్ర‌భుత్వం అన్ని విధాలా అండ‌గా నిలుస్తుంది. ప్ర‌మాదంలో గాయ‌ప‌డి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న మ‌రో వ్య‌క్తికి మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నాం.." అని ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.


Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు   


Also Read: 7th Pay Commission: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి గిఫ్ట్.. భారీగా జీతాలు పెంపు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook