Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు

Kotak Mahindra Bank Hikes Interest Rate on FD: కోటాక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన రేట్లు ఈ నెల 25వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 25, 2023, 09:13 PM IST
Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు

Kotak Mahindra Bank Hikes Interest Rate on FD: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయకపోయినా.. కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇటీవల ఐసీఐసీఐ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచిన తరువాత తాజాగా కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నెలలోనే ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా కోటక్ మహీంద్రా బ్యాంక్ పెంచిన వడ్డీ రేటు అక్టోబర్ 25వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై నిర్దిష్ట పదవీకాల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఈ పెంపుదల చేసింది.

కోటక్ బ్యాంక్ సామాన్యులకు 2.75 శాతం నుంచి 7.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 3.25 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది. తాజాగా రెండేళ్ల నుంచి మూడేళ్ల లోపు కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో అది 7.10 శాతానికి చేరింది.
 
23 నెలల నుంచి ఒక రోజు నుంచి రెండేళ్ల కంటే తక్కువ కాలానికి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇచ్చే వడ్డీని 7.20 శాతం నుంచి 7.25 శాతానికి పెంచింది. ఇది వివిధ పదవీకాల ప్రకారం 10 సంవత్సరాల కాలానికి అందిస్తోంది. బ్యాంక్ రింకరింగ్ డిపాజిట్లపై కస్టమర్లు 6 నుంచి 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. సీనియర్ సిటిజన్లకు ఆర్‌డిపై వడ్డీ 6.50 శాతం నుంచి 7.70 శాతం వరకు అందిస్తోంది. ఒక నెలలోపు డిపాజిట్‌ను క్లోజ్ చేస్తే.. వడ్డీ అందివ్వమని కోటాక్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఒక నెలలో ఎఫ్‌డీని క్లోజ్ చేస్తే.. కస్టమర్లు డిపాజిట్ చేసిన మొత్తం మాత్రమే తిరిగి చెల్లిస్తామని తెలిపింది.

Also Read: Benefits Of Eating Ghee: నెయ్యి వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు.. మీకు తెలియని విషయాలు ఇవే..! 

Also Read: Sunitha Laxma Reddy: ఉత్కంఠకు తెర.. నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News