Road Accidents Today in AP: ఆంధప్రదేశ్‌లో శుక్రవారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ రెండు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురికి క్షతగాత్రులు అయ్యారు. తిరుపతి జిల్లాలో కాలేజీ బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు జిల్లాలో ఆగి ఉన్న కంటైనర్‌ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. రెండు ఘటనపై కేసు నమోదు చేసిన ఆయా ప్రాంత పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. సమాచారం అందుకుని వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇలా...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరుపతి జిల్లాలోని నారాయణ వనం మండలంలోని బైపాస్ రోడ్డులో కారు-స్కూల్ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ఉన్న మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  మృతులను రమేష్, పుష్ప, భాను, వనజాక్షమ్మగా గుర్తించారు. వీరు పరమేశ్వర మంగళం గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారుఉ. పెరంబురులో ఓ నిశ్చితార్థానికి వెళుతుండగా.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ ముమ్మరం చేశారు.


నెల్లూరు జిల్లా కావలిలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. కావలి మండలం రుద్రకోట వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు చనిపోగా.. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స నిమిత్తం కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరు నెల్లూరులో ఓ పెళ్లి సంబంధానికి వచ్చి తిరిగి విజయవాడకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో రోడ్డుపై గడ్డి కోసుకుంటున్న ముద్దురుపాడుకు చెందిన సుబ్బమ్మ, కారులో ప్రయాణించే విజయవాడకు చెందిన సునీత, జీవన్ కుమార్ మృతి చెందారు. గాయపడినవారి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను కావలి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కావలి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Samsung Mobile Loot Offer: సాంసంగ్‌ వెబ్‌సైట్‌లో పిచ్చెక్కించే డీల్స్‌..Galaxy F54, M34 మొబైల్స్‌పై భారీ తగ్గింపు!  


Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook