Matrimonial Fraud: విదేశీ సంబధాల పేరిట మోసాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా సైబర్‌ నేరాలు ఆగడం లేదు. విదేశీ సంబంధం పేరిట ఓ యువతిని సైబర్‌ నేరగాడు మోసం చేశాడు. రూ.2.71 కోట్లు కాజేసిన సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. డబ్బులు చెల్లించిన తర్వాత ఎంతకీ తిరిగివ్వకపోవడం.. అమెరికాకు తీసుకెళ్లకపోవడంతో మోసపోయినట్లు గుర్తించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Siblings Died: ఘోర సంఘటన.. సెల్‌ఫోన్‌ చార్జింగ్‌ పెడుతూ నలుగురు చిన్నారులు మృతి


 


హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ పెళ్లి సంబంధాల కోసం చూస్తోంది. ఈ సందర్భంగా ఓ మ్యాట్రీమోనీ సైట్‌లో తన ప్రొఫెల్‌ను నమోదు చేసుకుంది. కొన్నాళ్లకు ఆమెకు విజయవాడలోని పోరంకి గ్రామానికి చెందిన శ్రీబాల వంశీకృష్ణ పరిచయమయ్యాడు. ఇరువురు ఆన్‌లైన్‌లో పరిచయాలు పెంచుకుని అనుబంధం పెంచుకున్నారు. మీ ప్రొఫెల్‌ నచ్చింది పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. తాను గ్లెన్‌మార్క్‌ కంపెనీలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్నట్లు ఆమెకు తెలిపాడు. అమెరికాకు తీసుకెళ్తానని నమ్మించాడు. కొన్ని రోజులకు తనలోని మోసగాడు బయటకు వచ్చాడు. ఆమెను మోసం చేసేందుకు కట్టుకథ అల్లాడు.

Also Read: Nitish Rana: రెచ్చగొడితే రచ్చరచ్చే.. ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చిన బౌలర్‌కు భారీ జరిమానా


 


'నీ సిబిల్‌ స్కోర్‌ తక్కువగా ఉంది' అని యువతికి చెప్పాడు. సిబిల్‌ స్కోర్‌ పెంచుకుంటే అమెరికాకు వెళ్లడానికి మార్గం సులువు అవుతుందని వివరించాడు. సిబిల్‌ స్కోర్‌ పెంచుతానని నమ్మించాడు. సిబిల్‌ స్కోర్‌ పెరగడానికి కంపెనీ నుంచి రుణాలు ఇప్పిస్తానని యువతిని నమ్మించి ఆమెకు సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించాడు.

ఆమె పేరుతో వివిధ బ్యాంక్‌ల ద్వారా రూ.2.71 కోట్లు రుణాలుగా తీసుకున్నాడు. తీసుకున్న రుణాలు చెల్లించకపోయాడు. అయితే తన వివరాలు తీసుకుని నమ్మించిన వ్యక్తి ఎంతకీ అమెరికాకు తీసుకెళ్లకపోవడంతో యువతి నిలదీసింది. అనంతరం కొన్నాళ్లకు ఆమెకు దూరమయ్యాడు. తాను మోసిపోయినట్లు గ్రహించి యువతి బాలకృష్ణపై సైబరాబాద్‌ పోలీసులకు ఈనెల 16వ తేదీన ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్ట అతగాడి బండారం బయటపడింది.


యువతి పేరు మీదుగా బాలకృష్ణ పలు బ్యాంకుల్లో రూ.2.71 కోట్లు అప్పులుగా తీసుకున్నారని తేలింది. వివిధ బ్యాంకుల నుంచి ఆరు పాస్‌ పుస్తకాలు, 10 డెబిట్‌ కార్డులు, 3 మొబైల్‌ ఫోన్లు, 4 సిమ్‌ కార్డులు అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విదేశీ సంబంధాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. లావాదేవీలు, వ్యక్తిగత వివరాలు ఇవ్వరాదని సూచించారు. సైబర్‌ నేరగాళ్ల ద్వారా మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్‌ చేయడం లేదా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలని సైబర్‌ పోలీసులు చెప్పారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి