Minor Girl Raped By School Headmaster: యావత్ ఉపాధ్యాయ ప్రపంచం తల దించుకునే ఘటన ఇది. తప్పు చేసే వారిని మందలించి బుద్ధి చెప్పాల్సిన గురువే మహా పాపం చేశాడు. ఒక చిన్నారి నిండు జీవితాన్ని కాపాడాల్సిన స్థానంలో ఉండి కూడా ఆ చిన్నారినే కాటేశాడు. నలుగురు మైనర్లు కలిసి ఒక 14 ఏళ్ల మైనర్ బాలికను అపహరించి పొదల్లోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేస్తుండగా అక్కడికి వెళ్లిన స్కూల్ హెడ్ మాస్టర్.. ఆ దుర్మార్గుల బారి నుంచి ఆ మైనర్ బాలికను కాపాడాల్సిందిపోయి.. అతడే ఆమెను రేప్ చేసిన ఘటన ఇది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిహార్ లోని కైమూర్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటనలో పోలీసులు సోమవారం స్కూల్ హెడ్ మాస్టర్ ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన గురించి కైమూర్ జిల్లా ఎస్పీ రాకేష్ కుమార్ మాట్లాడుతూ.. మైనర్ బాలికను రేప్ చేసిన స్కూల్ హెడ్ మాస్టర్ సురేంద్ర కుమార్ భాస్కర్ ని అదుపులోకి తీసుకున్నామని.. ఈ ఘటనకు బాధ్యులైన మరో నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నట్టు తెలిపారు.


బాధిత మైనర్ బాలిక వెల్లడించిన సమాచారం ప్రకారం గురువుల స్థానానికి మాయని మచ్చ తెచ్చిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన సమయంలోనే పక్క ఊరికి చెందిన నలుగురు మైనర్లు తనను కిడ్నాప్ చేసి అక్కడికి సమీపంలోని నిర్మానుష్యమైన ప్రదేశంలో పొదల్లోకి తీసుకెళ్లి రేప్ చేయడం మొదలుపెట్టారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నలుగురు మైనర్లు కలిసి ఒక మైనర్ బాలికను అపహరించి తీసుకెళ్లడం చూసిన హెడ్ మాస్టర్ సురేంద్ర కుమార్ భాస్కర్.. కొంత దూరం నుంచి వారిని అనుసరిస్తూ వెళ్లాడు. హెడ్ మాస్టర్ వెళ్లే సమయానికి నిందితులు ఒకరి తర్వాత మరొకరిగా బాలికను రేప్ చేసే పనిలో ఉన్నారు. హెడ్ మాస్టర్ ని చూడటంతోనే మైనర్లు బాలికను అక్కడే వదిలేసి భయంతో పరుగులు తీశారు.


తనను రేప్ చేస్తోన్న యువకుల బారి నుంచి స్కూల్ హెడ్ మాస్టర్ తనని కాపాడతాడని భావించానని.. కానీ ఆ యువకులు అక్కడి నుంచి పారిపోయాకా హెడ్ మాస్టర్ కూడా తనని రేప్ చేసి రక్తం స్రావం అవుతున్న తనని ఆ పొదల్లోనే వదిలేసి వెళ్లాడని బాధితురాలు వాపోయింది. 


అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని ఇల్లు చేరిన బాధితురాలు.. తనకు జరిగిన అన్యాయం గురించి ఇంట్లో తల్లికి చెప్పుకుని బోరుమంది. తల్లిదండ్రుల సహాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పోక్సో చట్టం కింద ( ప్రొటెక్షన్ ఆఫ్ చిల్ర్డన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ ) కేసు నమోదు చేసి హెడ్ మాస్టర్ ని అరెస్ట్ చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు జిల్లా ఎస్పీ రాకేష్ కుమార్ తెలిపారు. సెక్షన్ 164 ప్రకారం మెజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నామని.. వీలైనంత త్వరలోనే నలుగురు మైనర్లను కూడా పట్టుకుంటామని ఎస్పీ రాకేశ్ కుమార్ స్పష్టంచేశారు.


Also Read : Young Man Murdered: లవర్ పిలిచిందని వెళ్లాడు, విషం తినిపించి చంపిన ఫ్యామిలీ!


Also Read : Obscene Profiles: అమ్మను తిట్టారని మైనర్ ఘాతుకం.. అక్కా చెల్లెళ్ల ఫొటోలతో రెచ్చిపోయి!


Also Read : Drilling in Hand: విద్యార్థి ఎడమ చేతికి డ్రిల్లింగ్ చేసిన టీచర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook