Teacher Drilling in Student's Hand: అభం శుభం తెలియని విద్యార్థి పట్ల ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ పైశాచికంగా ప్రవర్తించాడు. తరగతి గదిలో రెండో ఎక్కం చెప్పలేకపోయినందుకు ఓ విద్యార్థిని నిలబెట్టి ఎడమ చేతిలో డ్రిల్లింగ్ చేశాడు. స్కూల్ టీచర్ పైశాచిక బుద్ధికి ఆ బాలుడి చేతికి తీవ్ర గాయమైంది. తమ కుమారుడిని స్కూల్ టీచర్ తీవ్రంగా హింసించి, చేతికి డ్రిల్లింగ్ చేసి గాయపర్చాడని సమాచారం అందుకున్న విద్యార్థి తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. తమ కుమారుడి చేతికి డ్రిల్లింగ్ చేయడంతో అయిన గాయం చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పశువులా ప్రవర్తించి తమ కుమారుడిని డ్రిల్లింగ్ మెషిన్‌తో హింసించిన స్కూల్ టీచర్‌కి, స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
స్కూల్ టీచర్ పైశాచిక దాడిలో గాయపడిన విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళనతో స్కూల్ ఎదుట కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే విషయమై బాలుడు, బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను రెండో ఎక్కం చెప్పాల్సిందిగా టీచర్ అడిగారని.. తాను చెప్పలేకపోవడంతో ఆగ్రహం తెచ్చుకున్న టీచర్ డ్రిల్లింగ్ మెషిన్ తో చేతికి డ్రిల్ చేశాడని.. కానీ తన పక్కనే ఉన్న మరో విద్యార్థి వెంటనే ఫ్లగ్ తీసేసి తనను సేవ్ చేశాడని బాలుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.
కాన్పూర్ నగర్ జిల్లాకు చెందిన విద్యాధికారి సుజిత్ కుమార్ సింగ్ ఈ ఘటనపై స్పందిస్తూ.. ఈ మొత్తం ఘటనపై ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించినట్టు స్పష్టం చేశారు. ప్రేమ్ నగర్, శాస్త్రి నగర్ల తాలూకా విద్యాధికారులు విచారణ జరిపి నివేదిక అందిస్తారని.. ఆ నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటామని సుజిత్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు.
డ్రిల్లింగ్ మెషిన్‌తో విద్యార్థిని శిక్షించారన్న ఘటన స్థానికంగానే కాదు.. సర్వత్రా చర్చనియాంశమైంది. విద్యార్థులను సొంత పిల్లల్లా ప్రేమించి పాఠాలు చెప్పే టీచర్లు ఉన్న చోటే.. విద్యార్థుల పట్ల పైశాచికంగా ప్రవర్తించి అత్యంత క్రూరంగా వ్యవహరించే టీచర్లు కూడా ఉన్నారని ఈ ఘటన నిరూపించింది.
Also Read : Tirupati: అగ్గిపెట్టే కోసం ప్రాణం తీశాడు.. వీడిన హత్య కేసు మిస్టరీ
Also Read : Student Arrested : చీచీ.. వీడెంత నీచుడు.. హాస్టల్ బాత్రూమ్లో అమ్మాయిలను అర్ధనగ్నంగా..
Also Read : Husband Murder: భర్తను చంపి, ముక్కలు చేసి.. ఒక్క పొరపాటు ఇద్దరినీ పట్టించింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook