Assault On Boy: మహిళలకు రక్షణ లేదు.. ఇప్పుడు అబ్బాయిలకు కూడా రక్షణ ఉండడం లేదు. కామ మైకంలో ముగ్గురు బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. మిరప తోట పనులకు వచ్చిన ముగ్గురు  కూలీలు విచక్షణరహితంగా బాలుడిపై గ్రామ శివారులో లైంగిక దాడి చేశారు. బాలుడు వారి దాడి నుంచి తప్పించుకుని బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలుడిని ఆస్పత్రిలో చేర్పించారు. ఏపీలోని పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. మూడు రోజుల కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Girl Pregnancy: పరీక్ష హాల్‌లో అడ్డం పడిన బాలిక.. ఆస్పత్రికి వెళ్తే గర్భవతి రూ.2 లక్షలకు ఖరీదు


పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం గ్రామంలో మిరప తోట పనుల కోసం కొందరు కూలీలు వచ్చారు. కూలీ కోసం ప్రకాశం జిల్లా సంతమాగులూరు గ్రామం నుంచి ఓ కుటుంబం వచ్చింది. తల్లిదండ్రులతోపాటు బాలుడు ఉన్నాడు. సోమవారం (మార్చి 18)న తెల్లవారుజామున ఆ దంపతుల కుమారుడు బహిర్భూమి కోసం వెళ్లాడు. అయితే అదే సమయంలో అదే గ్రామానికి వచ్చిన చందు, శీలంచర్ల కోటేశ్వరరావు, కామేశ్వరరావు బాలుడిని చూశారు. వెంటనే బాలుడిని పొదల్లోకి తీసుకెళ్లి ముగ్గురు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. కాగా ఆ ముగ్గురు నిందితులు కూడా మిరప తోట పనులకు వచ్చారు. 

Also Read: Jalahalli Incident: బూతు పనులకు అడ్డాగా మెట్రో స్టేషన్లు.. మహిళ ముందు ఉద్యోగి 'పాడు పని'


 


కుమారుడికి జరిగిన దారుణ విషయాలను కుటుంబసభ్యులు సంతమాగులూరు గ్రామ పెద్దలకు చెప్పారు. గ్రామ పెద్దలతో రాజీ చేయించి బాలుడికి ఆరోగ్యం బాగు చేస్తామని నిందితులు చెప్పారు. అయితే రెండు రోజుల తర్వాత బాలుడి పరిస్థితి గురించి ఆరా తీయగా 'ఇప్పుడు ఏం చేసుకుంటారో చేసుకో పోండి' అంటూ నిందితులు బెదిరించారు. అయితే బాలుడికి రక్తస్రావం ఎక్కువ కావడంతో సత్తెనపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు చికిత్స పొందుతున్నాడు. 


కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితుడి కుటుంబం డిమాండ్ చేస్తోంది. పొట్టకూటి కోసం ఊరు కానీ ఊరు వస్తే ఇలాంటి దారుణం చోటుచేసుకోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీనాలీ చేసుకునే తమకు ఇలాంటి పరిస్థితి ఏర్పడడంపై కన్నీటిపర్యంతమవుతున్నారు. బాలుడి వైద్యానికి కూడా డబ్బులు లేవని చెబుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించి తమ కొడుకు ఆరోగ్యం బాగు చేయాలని బాధిత తల్లిదండ్రులు కోరుతున్నారు. బాలుడిపై అత్యాచారం జరిగిన సంఘటన సోషల్‌ మీడియాలో, పల్నాడు జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ వార్త కాస్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. 'అబ్బాయిలకు కూడా రక్షణ లేదా?' అని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712